Share News

ఆ కుటుంబీకులకు సర్వీసు ప్రయోజనాలివ్వండి

ABN , Publish Date - Jan 25 , 2026 | 03:43 AM

సర్వీసులో ఉండగా కనిపించకుండా పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి పింఛను, ఇతర సర్వీసు ప్రయోజనాలు కల్పించాలని సీఆర్పీఎ్‌ఫకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

ఆ కుటుంబీకులకు సర్వీసు ప్రయోజనాలివ్వండి

  • సీఆర్పీఎఫ్‌కు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): సర్వీసులో ఉండగా కనిపించకుండా పోయిన కానిస్టేబుల్‌ కుటుంబానికి పింఛను, ఇతర సర్వీసు ప్రయోజనాలు కల్పించాలని సీఆర్పీఎ్‌ఫకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అలాగే అతడిని ఏకపక్షంగా సర్వీసు నుంచి తొలగించడం చెల్లదని పేర్కొంది. మియాపూర్‌కు చెందిన సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ ఎం.శ్రీకాంత్‌ సర్వీసులో ఉండగా కనిపించకుండా పోయున నేపథ్యంలో ఆయన్ను సర్వీసు నుంచి తొలగించడం చెల్లదని.. పింఛను, ఇతర ప్రయోజనాలు ఇప్పించాలని ఆయన తండ్రి ఎం.అప్పారావు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌సింగ్‌, జస్టిస్‌మొహియుద్దీన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. కానిస్టేబుల్‌కు రావాల్సిన పింఛను ప్రయోజనాలను ఆ కుటుంబానికి ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది.

Updated Date - Jan 25 , 2026 | 03:43 AM