Share News

భార్యాభర్తల సంభాషణలు వినడమూ డిగ్నిటీయా: బండి సంజయ్

ABN , Publish Date - Nov 15 , 2026 | 07:26 PM

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు. దోచుకోవడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.

భార్యాభర్తల సంభాషణలు వినడమూ డిగ్నిటీయా: బండి సంజయ్

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్.. బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విమర్శలు చేశారు. దోచుకోవడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా అని ఆయన ప్రశ్నించారు. ఆదివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘భార్యాభర్తల బెడ్రూం సంభాషణలను వినడం కూడా డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా? ఇంటర్ విద్యార్థులు, ఉద్యోగులను ఇబ్బంది పెట్టి ఆత్మహత్యలకు పురిగొల్పేలా చేయడమేంది? సర్పంచులు, కాంట్రాక్టర్లకు బిల్లులివ్వకుండా ఆత్మహత్యల పాల్జేయడమే డిగ్నిటీ ఆఫ్ ఆఫీసా? రాష్ట్ర ప్రజలకు డిగ్నిటీ ఆఫ్ ఆఫీస్ అంటే ఏమిటో తెలుసు. అందుకే బీఆర్ఎస్‌ను ఫాంహౌజ్ కే పరిమితం చేశారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారు.


గురువు కాళ్లు గుంజేవాళ్లం కాదు..

తాను బరాబర్ తన గురువుల కాళ్లు మొక్కుతానని బండి సంజయ్ తెలిపారు. ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ లెక్క మంది కొంపలు ముంచే విలువలు మాకు మా గురువులు నేర్పలేదు. మీ లాగా చెప్పులు ఎత్తుకుపోయేవాడిని కాదు. గురువు కాళ్లను గుంజేవాళ్లం కాదు. మావి సంస్కారం, విలువలతో కూడిన రాజకీయాలు’ అని సంజయ్ పేర్కొన్నారు.


రాహుల్ ప్రధాని అయితే దేశం ముక్కలే..

కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపైనా సంజయ్ విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ చెల్లని రూపాయి అని ఎద్దేవా చేశారు. విదేశాల్లోని చెల్లని రూపాయలను తీసుకొచ్చి సమ్మిట్ పెడితే ఒరిగేదేమిటి అని ప్రశ్నించారు. ప్రధాని అయ్యే అర్హతే రాహుల్ గాంధీకి లేదన్నారు. ఆయన పొరపాటున ప్రధాని అయితే దేశం ముక్కలవడం తథ్యమని సంజయ్ వ్యాఖ్యానించారు.


ఈ వార్తలూ చదవండి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

Updated Date - Nov 15 , 2026 | 07:26 PM