ముఖ్యమంత్రికి హాలిడే ఇద్దాం!
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:40 AM
కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్, క్రాఫ్, కార్ఖానాలు అన్నింటికీ హాలిడేని ప్రకటించిన ముఖ్యమంత్రికి హాలిడే ఇద్దామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
పంటలు వేయొద్దంటూ రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారు
మూడు సార్లు రైతుబంధును ఎగ్గొట్టిన దుర్మార్గుడు రేవంత్: కేటీఆర్
ఆదిలాబాద్, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్, క్రాఫ్, కార్ఖానాలు అన్నింటికీ హాలిడేని ప్రకటించిన ముఖ్యమంత్రికి హాలిడే ఇద్దామని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. యాసంగిలో పంటలు వేయొద్దంటూ రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ అడిగి.. వారిని మరణ శాసనం రాసుకోండంటూ ఆదేశించిన రాక్షసుడు రేవంత్‌రెడ్డి అని విరుచుకుపడ్డారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు గర్జన సభకు హాజరై ఆయన మాట్లాడారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లోని 34 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆనాడు రాహుల్ గాంధీ, సీఎం మాట్లాడిన మాటల వీడియోలను సభా వేదికపై ప్రదర్శించారు. మూడు సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన దుర్మార్గుడు సీఎం అని దుయ్యబట్టారు. ప్రీమియం కట్టకపోవడంతోనే రైతు బీమా పథకం ఆగిందని.. అప్పట్నుంచీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే 108 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు.
రాష్ట్రంలో విద్యుత్తు వ్యవస్థను సర్వనాశనం చేశారని.. లాభాల్లో ఉన్న సింగరేణిని బొగ్గు కుంభకోణంతో దివాలా తీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరించిందన్నారు. ‘దేశానికి అన్నం పెట్టిన తెలంగాణకు ఇప్పుడెందుకు కరువు వచ్చింది. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ తెచ్చిన కరువే. ఈ యేడు గోదావరి నదిలోకి 750 టీఎంసీల వరద నీరు వచ్చినా ఉపయోగించుకోలేని అసమర్థుడు రేవంత్.. జూన్ 19న బీఆర్‌ఎస్ బృందం కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి లక్ష క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్తున్నాయని చెప్పినా కాంగ్రెస్ సర్కారు పట్టించుకోలేదు. కరెంటు కోతలతో మోటార్లు, స్టార్టర్‌లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతున్నాయి. మొగోడు, మొనగాడు అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఏపీకి అక్రమంగా నీళ్లు వెళ్తుంటే ఎందుకు అడ్డుకోవట్లేదు. చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంకు నీరు తీసుకెళ్లాడు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టదు.. ఇదంతా ఉత్త డ్రామానే. ఎగురుకుంటూ మహారాష్ట్రకు పోయిన సీఎం సాధించిందేమీ లేదు’ అంటూ ధ్వజమెత్తారు.
ఢిల్లీ ఖాతాలో నెలనెలా ఈఎంఐ..
రైతుబంధు ఆగి పోయింది. రాహుల్ గాంధీ బంధు మాత్రం కొనసాగుతూనే ఉందని కేటీఆర్ మండిపడ్డారు. సీఎం ఢిల్లీ ఖాతాలో ఈఎంఐ వేస్తున్నాడని.. నెలనెలా ఢిల్లీకి డబ్బు మూటల సంచులు పంపి తన పదవిని రెన్యువల్ చేసుకుంటున్నాడని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది కౌలు రైతులకు ప్రేమలేఖలు రాసిన రేవంత్.. వారిని నిండా ముంచేశారన్నారు. ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ బీజేపీకి చెందిన వారే కదా.. మరి ఎందుకు రేవంత్ రెడ్డిని ప్రశ్నించడం లేదని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ మోసగాళ్లను నమ్మి తెలంగాణ ప్రజలు గోస పడుతున్నారని.. ఈ రెండు పార్టీలు దొందూ దొందేనని ఎద్దేవా చేశారు. గత 13 ఏళ్లలో ప్రధాని మోదీ తెలంగాణకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవగాహనతోనే సైబర్ నేరాలకు చెక్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News