ఆముదం గింజలు తిని ఆరుగురు గిరిజన చిన్నారులకు అస్వస్థత
ABN , Publish Date - Nov 11 , 2026 | 05:22 AM
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడకి చెందిన ఆరుగురు గిరిజన చిన్నారులు ఆముదం గింజలు తిని అస్వస్థతకు గురయ్యారు.
మెరుగైన చికిత్స కోసం ఆదిలాబాద్ తరలింపు
ఉట్నూర్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని మత్తడిగూడకి చెందిన ఆరుగురు గిరిజన చిన్నారులు ఆముదం గింజలు తిని అస్వస్థతకు గురయ్యారు. గ్రామస్థుల వివరాల ప్రకారం... ఆత్రం భూమిక, ఆత్రం తిరుపతి, ఆత్రం మీనాక్షి, సోయం జయ, సోయం లచ్చు, పెందుర్ రాయి బండు మంగళవారం సాయంత్రం గ్రామ సమీపంలోని ఆముదం చెట్ల వద్ద లభించిన గింజలు తిన్నారు.
చీకటి పడుతున్న సమయంలో వాంతులు చేసుకోవడంతో పాటు కడుపు నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం కోసం మండలకేంద్రంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆత్రం భూమిక, సోయం జయల పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం చిన్నారులను జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మాజీ ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, గ్రామ పటేల్ సిడాం సోనేరావు, బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు చిన్నారులను పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
విద్యాసంస్థల్లో సినిమా కార్యక్రమాలు నిషేధం!
రొమ్ము నుంచి ఇతర అవయవాలకు క్యాన్సర్!
ఆరోపణలపై నిష్పాక్షిక విచారణ జరిపించాలి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News