Share News

ఆదాయపు పన్ను ఎగవేసేందుకు.. బినామీ ఖాతాలతో రూ. కోట్ల లావాదేవీలు

ABN , Publish Date - Nov 29 , 2026 | 06:06 AM

కార్మికుల ఆధార్‌, పాన్‌ కార్డులను ఉపయోగించి వారి పేర్లపై బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. కోట్ల లావాదేవీలు నిర్వహించిన కేసులో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జిన్నింగ్‌ మిల్‌ యజమాని రాజ్‌కుమార్‌ మిట్టల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి తెలిపారు.

ఆదాయపు పన్ను ఎగవేసేందుకు.. బినామీ ఖాతాలతో రూ. కోట్ల లావాదేవీలు

  • ఆదిలాబాద్‌లో ప్రముఖ వ్యాపారవేత్త అరెస్ట్‌

ఆదిలాబాద్‌ టౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కార్మికుల ఆధార్‌, పాన్‌ కార్డులను ఉపయోగించి వారి పేర్లపై బినామీ బ్యాంకు ఖాతాలు తెరిచి రూ. కోట్ల లావాదేవీలు నిర్వహించిన కేసులో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, జిన్నింగ్‌ మిల్‌ యజమాని రాజ్‌కుమార్‌ మిట్టల్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్‌ డీఎస్పీ ఎల్‌. జీవన్‌ రెడ్డి తెలిపారు. ఈ వ్యవహారంలో ఆయన సోదరుడు సంజీవ్‌ కుమార్‌ మిట్టల్‌ పరారీలో ఉన్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు.


నిందితులు తమ వ్యాపార సంస్థల లావాదేవీలను ఆదాయపు పన్ను శాఖకు తెలియకుండా ఉంచి పన్ను ఎగవేసేందుకు తమ వద్ద పనిచేసే కార్మికుల ఆధార్‌, పాన్‌ కార్డులు సేకరించి... వారి సంతకాలతో శ్రీ రేణుకా మాత మల్టీ స్టేట్‌ కోఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీలో బ్యాంకు ఖాతాలు తెరిచి చెక్‌బుక్‌లను తమ అధీనంలో ఉంచుకున్నారు. ఈ ఖాతాల ద్వారా 2012-13 నుంచి 2015-16 వరకు సుమారు రూ.8.55 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. 2022 జూలైలో ఆదాయపు పన్ను శాఖ నుంచి కార్మికులకు నోటీసులు రావడంతో బినామీ ఖాతాల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తన ఖాతా ఫ్రీజ్‌ కావడంతోపాటు అందులోని రూ.2 కోట్లు వినియోగించుకోలేకపోవడంతో బాధితుడు భూమన్న వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. విదేశీ ఉద్యోగాల కోసం కొత్త పథకానికి శ్రీకారం

పోలీస్ శాఖలో అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించం: డీజీపీ ఆనంద్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 29 , 2026 | 06:06 AM