వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్.. ఇక ఫొటోలు, మెసేజ్‌లు షెడ్యూల్ చేసుకోవచ్చు!
ABN , Publish Date - Oct 13 , 2026 | 05:01 PM
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం తరచూ ఏదో కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంటుంది. అలానే తాజాగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో సూపర్ ఫీచర్‌ను పరిచయం చేయడానికి వాట్సాప్ సిద్ధమైంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఉపయోగిస్తున్న ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం తరచూ ఏదో కొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తుంటుంది. అలానే తాజాగా కస్టమర్లను ఆకట్టుకునేందుకు మరో సూపర్ ఫీచర్‌ను పరిచయం చేయడానికి వాట్సాప్ సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా వినియోగదారులు కోరుకుంటున్న షెడ్యూల్డ్ మెసేజెస్, ఫొటోలు, వీడియోల ఫీచర్‌ను వాట్సాప్ ప్రస్తుతం పరీక్షస్తోంది.
ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ టెక్స్ట్ మెసేజ్‌లు, ఫొటోలు, వీడియోలు లేదా లింక్‌లను ముందుగానే డ్రాఫ్ట్ చేసి, కావలసిన తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా వెళ్లేలా సెట్ చేసుకోవచ్చని వాట్సాప్ ప్రతినిధులు తెలిపారు. ప్రస్తుతం ఈ కొత్త ఆప్షన్ ఎంపిక చేసిన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే కొన్ని రోజుల్లో మరింత మందికి ఈ ఫీచర్‌ను అందించేందుకు వాట్సాప్ ప్రణాళిక రచిస్తుంది. వాట్సాప్‌లో రోజువారీ చాట్స్ మాత్రమే కాకుండా వ్యాపార ప్రకటనలు, బర్త్ డే విషెష్, రిమైండర్‌లు వంటివి పంపడం సాధారణం. అయితే సరైన సమయానికి వేరే పనుల్లో బిజీగా ఉండటం, మర్చిపోవడంతో మెసేజ్ పంపడం వీలుకాకపోవచ్చు. ఈ సమస్యలను పరిష్కరించడానికే వాట్సాప్ ఈ షెడ్యూలింగ్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది.
టెలిగ్రామ్ వంటి యాప్‌లలో ఈ ఫీచర్ 2019 నుంచే అందుబాటులో ఉన్నప్పటికీ, వాట్సాప్‌లో లేకపోవడం వెలితిగా ఉండేది. తాజాగా మెటా ఆధ్వర్యంలో పని చేసే వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకురావడం ద్వారా వినియోగదారుల ఏళ్ల నిరీక్షణకు తెరదించినట్లయింది. వాట్సాప్ బీటా ఇన్ఫో అందించిన రిపోర్టుల ప్రకారం.. ఆండ్రాయిడ్ బీటా వర్షన్ 2.26.40.7, 2.26.8.11 ఉపయోగిస్తున్న కొందరు టెస్టర్లకు ఈ ఫీచర్ అందింది.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ ప్రపంచ స్థాయి విధ్వంసకర ఓపెనర్‌గా మారాడు: దినేశ్ కార్తీక్
రంజీ ట్రోఫీకి అన్యాయం జరుగుతోంది.. బీసీసీఐపై గావస్కర్ అసంతృప్తి
బాధితుడికి రూ.70 లక్షలు చెల్లించాలని వినియోగదారుల ఫోరం తీర్పు