భారత్‌లో డ్రీమ్‌బీన్స్ యాప్ అందుబాటులోకి
ABN , Publish Date - Nov 03 , 2026 | 02:14 PM
గూగుల్ తన ఏఐ యాప్ డ్రీమ్‌బీన్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్‌ను పొందిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: గూగుల్ తన ఏఐ యాప్ డ్రీమ్‌బీన్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. దీంతో అమెరికా బయట ఈ యాప్‌ను పొందిన తొలి దేశంగా భారత్ నిలిచింది. యూజర్ల ఆన్‌లైన్ యాక్టివిటీస్, ఆసక్తులు, రోజువారీ సమాచారాన్ని విశ్లేషించి, వాటికి అనుగుణమైన పిక్స్‌తో స్టోరీస్‌ను ఈ యాప్ రూపొందిస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు డ్రీమ్‌బీన్స్ యాప్ అందుబాటులో ఉంది. ఇంగ్లిష్‌తో పాటు హిందీ, బెంగాలీ, తెలుగు, మరాఠీ, తమిళం, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, ఒడియా, పంజాబీ, అస్సామీ, నేపాలీ భాషల్లోనూ ఇది సేవలను అందిస్తుంది. ఒకేసారి ఒక భాషను మాత్రమే ఎంచుకోవాలి.
డ్రీమ్‌బీన్స్ ఎలా పనిచేస్తుందంటే?
యూజర్లు షేర్ చేసుకోవడానికి అనుమతించిన గూగుల్ సర్వీసెస్‌లు అయిన క్యాలెండర్, జెమిని, జీమెయిల్, ఫొటోస్, సర్చ్, యూట్యూబ్ నుంచి సమాచారాన్ని అనుసంధానం చేయడం ద్వారా ఈ యాప్ పనిచేస్తుంది. వీటి ద్వారా లభించే సమాచారాన్ని విశ్లేషిస్తుంది. యూజర్లు ఎలాంటి ప్రత్యేక ప్రాంప్ట్ ఇవ్వకుండానే వారి ఆసక్తులకు తగ్గ స్టోరీలను రూపొందిస్తుంది. ఆ స్టోరీలు ఏవైనా కావచ్చు. యూజర్లు ఆ స్టోరీల గురించి మరింత తెలుసుకోవడానికి, నచ్చిన సూచనలను బుక్‌మార్క్ చేయడానికి లేదా ఇతరులతో పంచుకోవడానికి ఆ స్టోరీలపై క్లిక్ చేయవచ్చు.
యాప్‌ను ఎలా ఉపయోగించాలంటే?
గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి డ్రీమ్‌బీన్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పర్సనల్ గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయి యాప్‌కు అనుసంధానం చేయాలనుకుంటున్న గూగుల్ సర్వీసెస్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం స్టోరీలు ఏ భాషలో కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత యూజర్లు ఇచ్చిన సమాచారం ఆధారంగా స్టోరీస్‌ను యాప్ రూపొందిస్తుంది.
ప్రైవసీకి ప్రాధాన్యం
ప్రస్తుతం వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలు ఉన్నవారికి మాత్రమే డ్రీమ్‌బీన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాప్ రూపొందించే కథలను సంబంధిత యూజర్లు మాత్రమే చూడగలరని గూగుల్ తెలిపింది. ఏయే సేవల నుంచి సమాచారాన్ని తీసుకోవాలన్నది వినియోగదారులే నిర్ణయించుకోవచ్చు. స్టోరీలను ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు. అలాగే డ్రీమ్‌బీన్స్ డేటాను కూడా డిలీట్ చేసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లైంగిక వేధింపుల కేసు.. జేఎన్‌యూ ప్రొఫెసర్ తొలగింపుపై స్టే
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతి