జొమాటోలో మెహమాన్ మోడ్.. ఆన్ చేస్తే ఫుడ్ ధరలు మాయం
ABN , Publish Date - Oct 29 , 2026 | 09:12 PM
మీ ఇంటికి అతిథులు వచ్చారా..? అయితే జొమాటో తీసుకురాబోతున్న మెహమాన్ మోడ్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో తన యూజర్ల కోసం ఓ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. మెహమాన్ మోడ్ అనే ఈ ఫీచర్‌తో అతిథి సేవ సులభం కానుందని ఆ యాప్ చెబుతోంది. ఈ మోడ్ ఆన్ చేసినప్పుడు ఆహార పదార్థాల వివరాలే కనిపిస్తాయి గాని ధర కనిపించదని అంటోంది. దీన్నే ‘ప్రైస్ మాస్కింగ్’ అని అంటారు. ఇంటికి గెస్టులు వచ్చిన సందర్భాల్లో ఈ మెహమాన్ మోడ్ ఎంతగానో ఉపయోగపడుతుందని జొమాటో సంస్థ వివరిస్తోంది. ఒక లింక్డ్ ఇన్ యూజర్ ఇచ్చిన సలహాను స్వీకరించిన ఆ సంస్థ.. త్వరలో ఈ ఫీచర్ అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించింది.
ఇంతకీ మెహమాన్ మోడ్ ఉపయోగమేంటి..?
ఇదివరకు ఇంటికి అతిథులు వస్తే స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఇప్పుడు ఆధునిక యుగంలో చాలామంది వచ్చిన అతిథులకు ఫుడ్ డెలివరీ యాప్‌ల నుంచి ఆహార పదార్థాలు తెప్పిస్తున్నారు. కొందరు ఫోన్ గెస్ట్‌ల చేతికే ఇచ్చి నచ్చింది ఆర్డర్ పెట్టుకోవాలని కోరుతున్నారు. అయితే ఇక్కడే ఒ చిక్కొచ్చి పడింది. అతిథులు ఆహార పదార్థాల ధర చూసి మొహమాటపడుతున్నారు. ఎక్కువ ధర ఉంటే ఆర్డర్ చేయడానికి సంకోచిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో మెహమాన్ మోడ్ ఉపయోగపడుతుంది. ఇది ఆన్ చేస్తే ఆహార పదార్థాల ధరలు ఎగిరిపోతాయి. కేవలం వంటకం వివరాలు మాత్రమే కనిపిస్తాయి. దీంతో గెస్ట్‌లు ఎలాంటి సంకోచాలు, మొహమాటాలూ లేకుండా నచ్చిన ఆహారాన్ని ఆర్డర్ పెట్టుకుంటారు.
ఇవీ చదవండి
మరో పదేళ్లలో ఏఐతో మానవాళికి ముప్పు: గూగుల్ మాజీ ఇంజినీర్
గూగుల్ నుంచి ఏఐ చిప్‌లు కొనుగోలు చేయనున్న ఓపెన్ ఏఐ