ఫేస్‌బుక్‌లో కొత్త ఇంటర్‌ఫేస్.. ఇకపై యాప్ తెరవగానే షార్ట్ వీడియోలు
ABN , Publish Date - Oct 07 , 2026 | 09:04 PM
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆ యాప్ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఫేస్‌బుక్‌ను తెరిచిన వెంటనే మొదటగా ఫుల్-స్క్రీన్ వీడియోలు, రీల్స్ కనిపించబోతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో షార్ట్ వీడియోలకున్న క్రేజ్ వేరు. టిక్‌టాక్‌తో మొదలైన ఈ షార్ట్ వీడియోల ట్రెండ్ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రేజ్‌కు తగ్గట్టుగా చాలా యాప్‌లు రూపాంతరం చెందుతూ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్ ఒకప్పుడు ఫొటో ఆధారిత యాప్‌గా ఉండేది. కానీ ఇప్పుడు ఆ యాప్‌లో అన్నీ రీల్సే దర్శనిమిస్తున్నాయి. అలాగే ఇదివరకు ఫేస్‌బుక్‌లో ప్రధానంగా రాతపూర్వక పోస్టులు, ఫొటోలు ఉండేవి. అయితే ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా మారబోతోంది.
ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ఆ యాప్ కొత్త వెర్షన్‌ను పరీక్షిస్తోంది. ఇకపై ఫేస్‌బుక్‌ను తెరిచిన వెంటనే మొదటగా ఫుల్-స్క్రీన్ వీడియోలు, రీల్స్ కనిపించబోతున్నాయి. అంటే ఈ యాప్ కూడా షార్డ్ వీడియో ప్రధానంగా ఉండబోతోందన్నమాట. ఈ కొత్త వెర్షన్ ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. తొలుత దీన్ని భారత్‌లో ఎంచుకున్న వినియోగదారులకు మెటా అందిస్తోంది. ఈ కొత్త ఇంటర్‌ఫేస్ పొందినవారికి ఫేస్‌బుక్ తెరవగానే రీల్స్ కనిపిస్తాయి. ఇప్పటివరకు ఆ యాప్‌లో ఉన్న ఇంటర్‌ఫేస్‌ను కూడా మెటా కొనసాగించాలనుకుంటుంది. ఇందుకోసం ప్రత్యేక ట్యాబ్‌ను తీసుకురానుంది.
ఇవీ చదవండి
చైనా ఏఐతో బ్యాంకుల హ్యాకింగ్.. దక్షిణ కొరియాలో కలకలం
ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా..