Share News

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్

ABN , Publish Date - May 22 , 2026 | 05:16 PM

ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ప్లే ఆఫ్స్‌కు ముందే ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే వైఫల్యాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.

సీఎస్కే వైఫల్యానికి అసలు కారణం ఇదే: సెహ్వాగ్
Virender Sehwag

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ప్లే ఆఫ్స్‌కు ముందే ముగిసింది. గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఘోర ఓటమితో చెన్నై టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో సీఎస్కే వరుసగా మూడోసారి టాప్ 4లో చోటు దక్కించుకోలేకపోయింది. ఈ సీజన్‌లో సీఎస్కే చేసిన అత్యంత పేలవ ప్రదర్శనలపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సీఎస్కే వైఫల్యాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేశాడు.


‘ఈ సీజన్‌లో సీఎస్కే ఎదుర్కొన్న అతిపెద్ద సమస్య బ్యాటింగ్. ధోని, బ్రెవిస్, మాత్రే, ఖలీల్ వంటి కీలక ప్లేయర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. ఇది జట్టును తీవ్రంగా దెబ్బతీసింది. ధోని లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపించింది. అయితే ప్రధాన సమస్య మాత్రం బ్యాటింగ్‌లో నిలకడ లేకపోవడమే. ఇతర జట్లతో పోలిస్తే సీఎస్కే బ్యాటర్లు స్థిరంగా రాణించలేదు. 180-190 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేకపోయారు. తొలుత బ్యాటింగ్ చేసినా 160 పరుగులుకే పరిమితం అయ్యారు. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు. గత సీజన్‌లో ఆకట్టుకున్న డేవాల్డ్ బ్రెవిస్ ఈసారి అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. సర్ఫరాజ్ ఖాన్, ఆయుశ్ మాత్రే, ఉర్విల్ పటేల్ నిలకడగా ఆడలేకపోయారు. బౌలింగ్ విభాగంలోనూ జట్టు ఆశించిన స్థాయిలో ఆడలేదు’ అని సెహ్వాగ్ విశ్లేషించాడు.


ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన సీఎస్కే.. చివరిసారిగా 2023లో ఎంఎస్ ధోని నాయకత్వంలో ట్రోఫీని ముద్దాడింది. ఈ సీజన్‌లో ధోని ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. జట్టు ఇప్పుడు మార్పుల దశలో ఉందని, ప్లేయర్లు నిలకడ సాధించేందుకు కాస్త సమయం పడుతోందని కోచ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

మా వాట్సాప్ గ్రూప్‌లోనూ వైభవ్ గురించే చర్చిస్తున్నాం: స్టువర్ట్ బ్రాడ్

ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా

Updated Date - May 22 , 2026 | 05:20 PM