Share News

ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా

ABN , Publish Date - May 22 , 2026 | 03:22 PM

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా
IPL black tickets

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్‌లో ఐపీఎల్ టికెట్ల దందా కలకలం రేపింది. బహిరంగంగానే స్టేడియం బయట తిరుగుతూ బ్లాక్‌లో ఐపీఎల్ మ్యాచ్ కాంప్లిమెంటరీ టికెట్లు విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించారు. ఐపీఎల్ మ్యాచ్‌కు ఉన్న క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమ మార్గాల్లో లాభాలు పొందేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సీపీ సుమతి ఆదేశాలతో బ్లాక్ టికెట్లపై ఉప్పల్ పోలీసులు దృష్టి సారించారు.


ఐపీఎల్ 2026లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి. ఎస్ఆర్‌హెచ్‌కు ఇది చివరి లీగ్ మ్యాచ్. దీంతో ఐపీఎల్ టికెట్ల కోసం అభిమానులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కూడా ఐపీఎల్ టికెట్ల ధరలను భారీగా పెంచింది. రూ.950 టికెట్ ధరను రూ.2 వేలకు, రూ.1500 టికెట్‌ను రూ.3వేలకు, రూ.1910 టికెట్‌ను రూ.3,500కు, రూ.2,500 టికెట్ ధరను రూ.4,500కు, రూ.7 వేల టికెట్‌ను రూ.10 వేలకు, రూ.23 వేల బాక్స్ టికెట్ ధరను రూ.30 వేలకు పెంచారు. అంత ధరలు పెట్టలేక, మ్యాచ్‌ను స్టేడియంలో చూసేందుకు ప్రయత్నిస్తోన్న అభిమానులను ఆసరాగా చేసుకుని బ్లాక్‌లో టికెట్లు విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. అభిమానులు టికెట్ల కొనుగోలు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనధికార వ్యక్తుల నుంచి టికెట్లు కొనుగోలు చేయవద్దని సూచించారు.


ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

ఓటమి బాధలో ఉన్న సీఎస్కేకు మరో బిగ్ షాక్

Updated Date - May 22 , 2026 | 03:29 PM