Share News

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..

ABN , Publish Date - May 22 , 2026 | 01:40 PM

ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

చరిత్ర సృష్టించిన సాయి సుదర్శన్.. రెండవ భారత క్రికెటర్‌గా రికార్డ్..
Sai Sudarshan IPL 2026

స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌పై 89 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో గుజరాత్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. సీఎస్కేతో మ్యాచ్‌లో 53 బంతుల్లో 84 పరుగులు చేశాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే వరుసగా 5 అర్ధ సెంచరీలు నమోదు చేసిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో మొత్తంగా ఏడు అర్ధ శతకాలు, ఒక శతకం సాధించాడు సాయి సుదర్శన్.


ఐపీఎల్‌లో వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు బాదిన జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2012లో ఢిల్లీ డేర్ డేవిల్స్ తరఫున వీరేంద్ర సెహ్వాగ్ వరుసగా ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. ఆ తర్వాత జోస్ బట్లర్, డేవిడ్ వార్నర్ ఈ ఘనతను అందుకున్నారు. 2018లో రాజస్థాన్ రాయల్స్ తరఫున జోస్ బట్లర్, 2019లో సన్‌ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ వరుసగా 5 హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. గత ఏడేళ్లుగా ఈ ఫీట్ ఎవరూ అందుకోపోగా.. సాయి సుదర్శన్ తాజా సీజన్‌లో ఈ అరుదైన రికార్డును సాధించాడు.


టీమిండియా దిగ్గజం, కింగ్ కోహ్లీకి కూడా ఈ ఘనత సాధ్యం కాలేదు. ఈ సీజన్‌లో సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగుతున్నాడు. సాయి సుదర్శన్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్, కేకేఆర్‌లపై వరుసగా 57, 55, 61, 53* పరుగులు చేశాడు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ పై మరో అర్ధ సెంచరీ(84) చేయడంతో వరుసగా ఐద హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్ల జాబితాలో స్థానం సంపాదించాడు. ఇక మొత్తంగా టీ20 క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక హాఫ్ సెంచరీలు బాదిన రికార్డ్ రియాన్ పరాగ్ పేరిట ఉంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అతను వరుసగా 7 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు.


ఇవి కూడా చదవండి:

టీ20ల్లో కనోర్‌ కరోల్ సరికొత్త ప్రపంచ రికార్డు

విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్

Updated Date - May 22 , 2026 | 01:44 PM