విరాట్ రికార్డు బ్రేక్ చేసిన శుభ్‌మన్ గిల్
ABN , Publish Date - May 22 , 2026 | 09:58 AM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్ 89 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించింది. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గుజరాత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 37 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్స్‌ర్లతో 64 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గిల్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో గిల్ 64 పరుగులు చేయడంతో ఈ ఏడాది సీజన్‌లో 600 పరుగుల మైలు రాయిని దాటేశాడు. కెప్టెన్‌గా గిల్ ఒకే సీజన్‌లో 600 పరుగులను పూర్తి చేసుకోవడం ఇది రెండో సారి. ఐపీఎల్ చరిత్రలో 27 ఏళ్ల వయస్సులోపు కెప్టెన్‌గా ఒకటి కంటే ఎక్కువ సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా గిల్ నిలిచాడు. గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ 27 ఏళ్ల వయస్సు లోపు కేవలం ఒక్క సీజన్‌లో మాత్రం ఈ ఫీట్ సాధించాడు. తాజా మ్యాచ్‌తో కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.
అదేవిధంగా వరుస సీజన్లలో 600కు పైగా పరుగులు చేసిన అతి పిన్న వయస్కుడైన కెప్టెన్‌గా గిల్ నిలిచాడు. గతంలో ఈ రికార్డ్ కేఎల్ రాహుల్ పేరిట ఉండేది. అతడు 29 ఏళ్ల వయసులోలో ఈ ఫీట్ సాధించాడు. 27 ఏళ్లు నిండకముందే ఒక ఆటగాడిగా ఐపీఎల్‌లో మూడు వేర్వేరు సీజన్లలో 600 ప్లస్ పరుగులు సాధించిన ఏకైక క్రికెటర్‌గా గిల్ చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి..
అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..
రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..