Share News

ఉప్పల్‌లో నేడు ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల విక్రయాలపై పోలీసుల నిఘా

ABN , Publish Date - May 22 , 2026 | 07:51 AM

ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. వివరాల్లోకి వెళితే..

ఉప్పల్‌లో నేడు ఐపీఎల్ మ్యాచ్.. బ్లాక్ టికెట్ల విక్రయాలపై పోలీసుల నిఘా
IPL 2026 SRH vs RCB

హైదరాబాద్, మే 22: ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో శుక్రవారం జరగనున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు కొంతమంది కేటుగాళ్లు బ్లాక్ టికెట్ల దందాకు తెరలేపారు. ఫ్యాన్స్ బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆన్‌లైన్‌లో టికెట్లు ప్రారంభమైన కొద్దిసపటికే అమ్ముడుపోయినట్లు చూపడంతో ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్లకు ఈ మ్యాచ్ అత్యంత కీలకం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


డిమాండ్‌ని బట్టి సాధారణ ధరలకు మించి టికెట్లను విక్రయిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఈ దందాపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. ఐపీఎల్ టికెట్లను అక్రమంగా బ్లాక్‌లో అమ్మినా లేదా నకిలీ టికెట్లతో మోసాలకు పాల్పడినా చట్టప్రకారం కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో బ్లాక్ టికెట్లు అమ్ముతున్న పలువురిని గుర్తించి, కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.


ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 09:19 AM