Share News

కాంపౌండ్‌ ఆర్చరీ కోచ్‌గా డేవ్‌

ABN , Publish Date - May 22 , 2026 | 01:54 AM

కాంపౌండ్‌ ఆర్చరీ చీఫ్‌ కోచ్‌గా అమెరికాకు చెందిన మాజీ వరల్డ్‌ చాంపియన్‌ డేవ్‌ కజిన్స్‌ను భారత ఆర్చరీ సంఘం నియమించింది....

కాంపౌండ్‌ ఆర్చరీ కోచ్‌గా డేవ్‌

కోల్‌కతా: కాంపౌండ్‌ ఆర్చరీ చీఫ్‌ కోచ్‌గా అమెరికాకు చెందిన మాజీ వరల్డ్‌ చాంపియన్‌ డేవ్‌ కజిన్స్‌ను భారత ఆర్చరీ సంఘం నియమించింది. లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీకి చోటుదక్కడంతో.. ఈ విభాగంలో పతకమే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వచ్చే నెల అంటాల్యాలో జరిగే వరల్డ్‌కప్‌ స్టేజ్‌-3 పోటీలు డేవ్‌కు తొలి పరీక్ష. 2028 ఒలింపిక్స్‌ వరకు డేవ్‌ కోచ్‌గా కొనసాగుతాడు. కాగా, రికర్వ్‌ కోచ్‌గా కొరియా-అమెరికన్‌ కిసిక్‌ లీతో జరుగుతున్న చర్చలపై పెద్దగా పురోగతి కనిపించడం లేదు. లీ భారీ ప్యాకేజ్‌ డిమాండ్‌ చేస్తుండడంతో.. పార్ట్‌టైమర్లతో నడిపించాలని సం ఘం భావిస్తోంది.

ఇవి కూడా చదవండి..

అప్పు గొడవ.. కారు బోనెట్‌పై 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లిన వ్యక్తి..

రాంచీకి వెళ్లిన ధోని.. చెన్నై ప్లే ఆఫ్స్‌కి చేరితే మళ్లీ వెనక్కి వస్తాడా..

Updated Date - May 22 , 2026 | 01:54 AM