Share News

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

ABN , Publish Date - May 22 , 2026 | 10:58 AM

దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది.

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో ఖాళీ కానున్న 4 స్థానాలు

న్యూఢిల్లీ, మే 22: దేశంలో వివిధ రాష్ట్రాల్లోని పలువురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఎన్నికల ప్రకటన విడుదల చేసింది. దేశంలో మొత్తం 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయని పేర్కొంది. జూన్ 1వ తేదీన ఈ ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. జూన్ 1 నుంచి జూన్ 8 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని పేర్కొంది.


జూన్ 9వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని.. జూన్ 10వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుందని వివరించింది. జూన్ 18వ తేదీన ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తామంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి.. ఫలితాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. గుజరాత్‌లో 4, కర్ణాటకలో 4, మధ్యప్రదేశ్‌లో 3, రాజస్థాన్‌లో 3, జార్ఖండ్‌లో 2 స్థానాలతో పాటు మణిపూర్, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరంలో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.


వాటితో పాటూ ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. జూన్ 21వ తేదీతో వైసీపీ నుంచి ఎంపికైన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్‌తో పాటు టీడీపీ నుంచి ఎంపికైన సానా సతీష్ పదవీ కాలం ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో కూటమిలోని పార్టీలకు 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. దాంతో ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు ఆయా పార్టీలు సొంతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

Rajyasabha Elections.jpeg


ఈ వార్తలు కూడా చదవండి:

నిలకడగా బంగారం, వెండి ధరలు..

కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి లోకేశ్ కౌంటర్

For More National News And Telugu News

Updated Date - May 22 , 2026 | 12:17 PM