ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్
ABN , Publish Date - Jun 12 , 2026 | 09:02 AM
ఐపీఎల్ 2026 విజయం తర్వాత విరాట్ కోహ్లీ కొత్త లుక్‌లో కనిపించాడు. ఇది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులలో ఉత్సాహాన్ని నింపింది. వైరలైన ఫోటోల్లో కొత్త హెయిర్ స్టైల్‌తో కోహ్లీ ఆకట్టుకుంటున్నాడు.
స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్‌స్టైల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ కొత్త పాస్టెల్ హెయిర్ కలర్‌తో ప్రయోగాలు చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టైటిల్‌ను సాధించిన తర్వాత విరాట్ ఈ న్యూ హెయిర్ స్టైల్‌లో కనిపించాడు. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి కోహ్లీ జట్టు ఆర్‌సీబీ వరుసగా రెండో టైటిల్‌ను కైవసం చేసుకుంది. తాజాగా కోహ్లీ కొత్త హైయిర్ లుక్‌ను హెయిర్‌స్టైలిస్ట్ రషీద్ సల్మానీ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. కోహ్లీ తన లుక్‌తో సెల్ఫీ తీసుకుంటున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ఇప్పుడు పాస్టెల్స్‌లో కింగ్ కోహ్లీ' అని రషీద్ రాసుకొచ్చాడు.
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో తెగ వైరల్ కావడమే కాకుండా భారీగా లైక్‌లను సంపాదించింది. ఈ వీడియోను అనుష్క శర్మ కూడా లైక్ చేశారు. అయితే రషీద్ కోహ్లీకి స్టైలింగ్ చేయడం ఇది మొదటిసారి కాదు. 2022 నాటి ఒక పోస్ట్‌లో కోహ్లీ తన హెయిర్‌స్టైల్‌ను కనిపించేలా, అతడి వెనుక సల్మానీ నిలబడి ఉన్నాడు. గత నెలలో సల్మానీ అనుష్క జుట్టుకు కూడా రంగు వేశారు. ఇక కండరాల గాయం నుంచి కోలుకోక పోవడంతో, ఈ నెల చివర్లో ఆఫ్గానిస్థాన్‌తో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు.
కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఈ మూడు వన్డేలు వరుసగా జూన్ 13, 17, 20 తేదీలలో ధర్మశాల, లఖ్‌నవూ, చెన్నైలలో జరగనున్నాయి. అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య ఇటీవల జరిగిన ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా కండరాల గాయానికి గురయ్యాడు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ అజేయంగా 75 పరుగులు చేసి, ఆర్సీబీకి వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇవి కూడా చదవండి: