Share News

క్వార్టర్స్‌లో సింధు, తన్వి

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:59 AM

తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ తన్వీ శర్మ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ చేరారు. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో...

క్వార్టర్స్‌లో సింధు, తన్వి

సిడ్నీ: తెలుగమ్మాయి పీవీ సింధు, యువ షట్లర్‌ తన్వీ శర్మ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ చేరారు. గురువారం జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో సింధు 22-20, 21-12తో సహచర షట్లర్‌ ఇషారాణిపై, 17 ఏళ్ల తన్వీ 21-13, 21-15తో భారత షట్లర్‌ మాళవిక బన్సోద్‌పై గెలిచి, ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో ఎం.ఆర్‌.అర్జున్‌-హరిహరన్‌ జోడీ 21-17, 21-7తో మైఖెల్‌ ఒవెన్‌-డైలాన్‌ సోయెడ్జాసా (న్యూజిలాండ్‌)పై నెగ్గి, తదుపరి రౌండ్‌లో ప్రవేశించారు. ఇతర మ్యాచ్‌ల్లో సింగిల్స్‌లో తాన్య, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌, మనీష జోడీ ఓడి, టోర్నీ నుంచి నిష్క్రమించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 04:59 AM