Share News

భారత్‌ ‘ఎ’కు ఝలక్‌

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:03 AM

ముక్కోణపు ‘ఎ’ వన్డే సిరీ్‌సలో భారత జ ట్టు 349 పరుగుల భారీ స్కోరు సాధించినా.. అఫ్ఘానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో...

భారత్‌ ‘ఎ’కు ఝలక్‌

డ/లూ పద్ధతిన అఫ్ఘాన్‌ గెలుపు

ముక్కోణపు ‘ఎ’ సిరీస్‌

దంబుల్లా: ముక్కోణపు ‘ఎ’ వన్డే సిరీ్‌సలో భారత జ ట్టు 349 పరుగుల భారీ స్కోరు సాధించినా.. అఫ్ఘానిస్థాన్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతిన ఓటమిపాలైంది. వర్షంతో 49 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత భారత్‌ 9 వికెట్లకు 349 పరుగులు సాధించింది. ప్రభ్‌సిమ్రన్‌ (84), తిలక్‌ వర్మ (66), రుతురాజ్‌ (66), వైభవ్‌ (44), సూర్యాన్ష్‌ (40) అదరగొట్టారు. అబ్దుల్లాకు ఐదు, ఫర్మానుల్లాకు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత వర్షం కురవడంతో లక్ష్యాన్ని 38 ఓవర్లలో 294 రన్స్‌కు కుదించారు. ఛేదనలో అఫ్ఘాన్‌ 25.5 ఓవర్లలో 177/2 స్కోరు వద్ద మళ్లీ వర్షం అడ్డొచ్చింది. ఈసారి తెరిపినివ్వలేదు. దీంతో డ/లూ పద్ధతిన అప్పటికి 3 రన్స్‌ ఎక్కువ చేసిన అఫ్ఘాన్‌ను విజేతగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:03 AM