Share News

ఫిఫా వరల్డ్ కప్ 2026: దక్షిణాఫ్రికాపై మెక్సికో ఘన విజయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 07:43 AM

కోట్లాది మంది ఫుట్‌బాల్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న సాకర్‌ సమరం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ 2026 ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు బోణీ కొట్టింది.

ఫిఫా వరల్డ్ కప్ 2026: దక్షిణాఫ్రికాపై మెక్సికో ఘన విజయం
Mexico vs South Africa

స్పోర్ట్స్ డెస్క్: ఫిపా ప్రపంచ కప్ 2026 సమరం ప్రారంభమైంది. మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో జట్టు బోణీ కొట్టింది. గ్రూప్‌-ఎలో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో దక్షిణాఫ్రికాను మెక్సికో చిత్తు చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన మెక్సికో జట్టు.. 9వ నిమిషంలోనే గోల్‌ సాధించింది. సౌదీ లీగ్‌లో టాప్‌ స్కోరర్‌గా ఉన్న జులియన్‌ క్వినోన్స్‌ అదే ఫామ్‌ను కొనసాగిస్తూ తొలిగోల్‌ చేసి మెక్సికో జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ఇక రెండో అర్ధభాగంలో రావుల్‌ జిమినెజ్‌ మరో గోల్‌ కొట్టి మెక్సికో అభిమానులను ఆనందంలో ముంచెత్తాడు.


ఈ మ్యాచ్‌లో రెఫరీ ముగ్గురు ఆటగాళ్లకు రెడ్‌ కార్డులు ఇచ్చాడు. వీరిలో ఇద్దరు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు, ఒకరు మెక్సికన్‌ ప్లేయర్‌ ఉన్నారు. రెడ్ కార్డు ప్రభావంతో 9 మందితోనే దక్షిణాఫ్రికా మ్యాచ్‌ ఆడింది. గతంలో 2010 జూన్ 11న జోహన్నెస్‌బర్గ్‌లోని సాకర్ సిటీలో జరిగిన 2010 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్‌లో కూడా మెక్సికో, దక్షిణాఫ్రికా జట్లు కూడా తలపడ్డాయి. ఆ మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్ Aలో మెక్సికో, దక్షిణాఫ్రికా, చెకియా, దక్షిణ కొరియా ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మెక్సికో ఫేవరెట్‌ జట్టుగా ఉంది. దక్షిణాఫ్రికా 60వ ర్యాంకుతో గ్రూప్‌లోనే అత్యంత తక్కువ స్థానంలో ఉంది.


ఇవి కూడా చదవండి:

క్వార్టర్స్‌లో సింధు, తన్వి

ఆసీస్‌ జట్టులో ‘భారత’ ఆటగాడు!

Updated Date - Jun 12 , 2026 | 07:49 AM