ఆటపాటలతో ఆరంభం
ABN , Publish Date - Jun 12 , 2026 | 05:07 AM
ప్రపంచలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ అట్టహాసంగా ఆరంభమైంది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను...
నేటి మ్యాచ్‌లు
ద.కొరియా X చెక్ రిపబ్లిక్ ఉ. 7.30
కెనడా X బోస్నియా అర్ధరాత్రి 12.30
యునైట్-8, డీడీ స్పోర్ట్స్‌లో..
ఘనంగా ఫిఫా వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు
ఆకట్టుకున్న షకీరా నృత్యం
మెక్సికో సిటీ: ప్రపంచలోనే అత్యంత ఆదరణ కలిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ అట్టహాసంగా ఆరంభమైంది. ఈనేపథ్యంలో గురువారం రాత్రి జరిగిన ప్రారంభ వేడుకలు అభిమానులను ఆనంద డోలికల్లో ముంచాయి. వందలాదిమంది కళాకారులతో పాటు తమ గాన మాధుర్యంతో ప్రఖ్యాత సింగర్లు.. వేలాదిగా తరలి వచ్చిన ప్రేక్షకులను కట్టిపడేశారు. ముందుగా మెక్సికో సంస్కృతీ సంప్రదాయాలతో పాటు తమ చరిత్రను నృత్యకారులు ఘనంగా ప్రదర్శించారు. అంతలోనే వేదిక మధ్యలో నుంచి భారీ ఫిఫా వరల్డ్‌కప్ పైకి రావ డం ఆకట్టుకుంది. ఇక మెక్సికన్ పాప్ బ్యాండ్ మనా రాకతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆ తర్వాత లాస్‌ఏంజిల్స్ అజులెస్ గ్రూప్, కొలంబియా సింగర్ జె బల్విన్ ప్రదర్శనల తర్వాత చివర్లో ప్రఖ్యాత పాప్ గాయని షకీరా స్టేడియంలో ప్రవేశించింది. ఫిఫా అధికారిక గీతమైన ‘డాయి డాయి’ని తను నైజీరియన్ బర్నా బాయ్‌తో ఆలపించగా.. ప్రేక్షకులు కూడా గొంతు కలిపారు. అనంతరం మెక్సికో-దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కావడంతో ఫిఫా వరల్డ్‌క్‌పకు తెర లేచినట్టయ్యింది.
ఇవి కూడా చదవండి..
పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..
మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..