Share News

ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌కి చోటు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:01 AM

దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌కు భారత అండర్‌-19 బృందంలో చోటు లభించింది....

ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌కి చోటు

  • భారత అండర్‌-19 జట్లలో ముగ్గురు తెలుగు ప్లేయర్లు

  • యశ్‌వీర్‌, ప్రతీక్ష, దీక్షకు స్థానం

న్యూఢిల్లీ: దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌కు భారత అండర్‌-19 బృందంలో చోటు లభించింది. గురువారం శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత పురుషుల, మహిళల టీ20, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్లలో హైదరాబాద్‌కు చెందిన వి.యశ్‌వీర్‌ గౌడ్‌, వి.ప్రతీక్ష, గుంటూరు అమ్మాయి కె.దీక్ష స్థానం దక్కించుకున్నారు. వన్డే, టీ20 రెండు జట్లకు యశ్‌బర్దన్‌ సింగ్‌ చౌహాన్‌ను, మహిళా జట్లకు భావికా అహిరేను కెప్టెన్లుగా నియమించారు. పురుషుల వన్డే టీమ్‌లో హైదరాబాద్‌ ఎడమ చేతివాటం స్పిన్నర్‌ యశ్‌వీర్‌కు చోటు లభించింది. మహిళల్లో గుంటూరు అమ్మాయి కె.దీక్ష రెండు జట్లకు వికెట్‌ కీపర్‌గా ఎంపిక కాగా, హైదరాబాద్‌ బ్యాటర్‌ వి.ప్రతీక్షకు వన్డే జట్టులో స్థానం దక్కింది.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:01 AM