Share News

విలాసవంతమైన ఇంట్లోకి శ్రేయస్ అయ్యర్.. అద్దె ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - Jun 11 , 2026 | 05:27 PM

భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో ఓ విలాసవంతమైన నివాసాన్ని అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వర్లీ (Worli)లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో మూడు సంవత్సరాల లీజ్ ఒప్పందంతో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు.

విలాసవంతమైన ఇంట్లోకి శ్రేయస్ అయ్యర్.. అద్దె ఎంతో తెలిస్తే..
Shreyas Iyer

భారత టీ20 జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముంబైలో ఓ విలాసవంతమైన నివాసాన్ని అద్దెకు తీసుకున్నాడు. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన వర్లీ (Worli)లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో మూడు సంవత్సరాల లీజ్ ఒప్పందంతో ఈ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఈ మొత్తం లీజ్ ఒప్పంద విలువ రూ.7.14 కోట్లు. ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ (IGR) వెబ్‌సైట్‌ ఈ విషయాన్ని వెల్లడించింది (Shreyas Iyer Worli apartment).


వర్లీలోని విలాసవంతమైన ఆర్టేసియా ప్రాజెక్టులో ఉన్న ఈ అపార్ట్‌మెంట్ సుమారు 3,875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. నాలుగు కార్లను పార్కింగ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ఒప్పందం ప్రకారం మొదటి సంవత్సరానికి నెలకు రూ.18.5 లక్షల అద్దె చెల్లించాలి. ఇక, రెండో సంవత్సరంలో అద్దె సుమారు 7 శాతం పెరిగి రూ.19.79 లక్షలకు చేరుకోనుండగా, మూడో సంవత్సరంలో అది రూ.21.18 లక్షలకు పెరుగుతుంది. మూడు సంవత్సరాల్లో మొత్తం రూ.7.14 కోట్లు అద్దెగా చెల్లించాలి (Shreyas Iyer house).


శ్రేయస్ అయ్యర్ ఇటీవలే భారత టీ20 జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు (Mumbai luxury home). కెప్టెన్‌గా ఎంపికైన కొద్ది రోజులకే ముంబైలోని ఈ లగ్జరీ నివాసాన్ని అద్దెకు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. కాగా, అయ్యర్‌కు ఇప్పటికే ముంబైలో విలాసవంతమైన సొంత ఇల్లు ఉంది. 2020లో అయ్యర్ రూ.12 కోట్లతో నాలుగు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ను కొనుగోలు చేశాడు.


ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..


మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 11 , 2026 | 05:46 PM