Share News

సింహాల్లా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండేవాళ్లం: వెంకటేశ్ అయ్యర్

ABN , Publish Date - Nov 07 , 2026 | 06:59 AM

2024లో కేకేఆర్‌ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌.. మెంటార్ గౌతమ్ గంభీర్ పెట్టిన రూల్స్ గురించి తాజాగా గుర్తు చేసుకున్నాడు. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే వాతావరణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సింహాల్లా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండేవాళ్లం: వెంకటేశ్ అయ్యర్
Venkatesh Iyer

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌ 2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) ఛాంపియన్‌గా నిలవడం వెనుక ఆటగాళ్ల సమష్టి కృషితో పాటు అప్పటి మెంటార్‌ గౌతమ్‌ గంభీర్‌ నాయకత్వం కూడా కీలక పాత్ర పోషించింది. జట్టులోని ప్రతి ఆటగాడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండాలన్నది గంభీర్‌ పెట్టిన ప్రమాణం. తాజాగా 2024లో కేకేఆర్‌ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ ఈ విషయాలను గుర్తు చేసుకున్నాడు. ఆ జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉండే వాతావరణం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.


‘బ్యాటింగ్‌ లైనప్‌లో ప్రతి ఒక్కరూ తమ వంతు అవకాశం కోసం సిద్ధంగా ఉండేవారు. ఓ మ్యాచ్‌లో సునీల్‌ నరైన్‌, ఫిల్‌ సాల్ట్‌ క్రీజులో ఉండగానే.. రెండో ఓవర్‌ నుంచే దాదాపు ఎనిమిది మంది బ్యాటర్లు ప్యాడ్లు కట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అది చూసి జట్టులోని ఆటగాళ్లంతా సింహాల్లా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని అనిపించేది. జట్టులో ఎవరూ సగటు ప్రదర్శనతో సరిపెట్టుకోకూడదన్నది గంభీర్‌ ఆలోచన. ప్రతి ఆటగాడు జట్టు విజయానికి తన వంతు బాధ్యత తీసుకోవాలని ఆయన కోరుకునేవారు. కేవలం వ్యక్తిగత ప్రదర్శనపైనే కాకుండా.. జట్టు ఎలా మెరుగుపడాలనే దానిపై కూడా ఆటగాళ్లు ఆలోచించాలని సూచించేవారు’ అని వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

Updated Date - Nov 07 , 2026 | 07:05 AM