Share News

ధినిధి డబుల్‌ ధమాకా

ABN , Publish Date - Nov 07 , 2026 | 01:33 AM

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతక జోరు కొనసాగుతోంది. శుక్రవారం నాటి పోటీల్లో స్విమ్మ ర్లు రెండు పతకాలు కొల్లగొట్టారు.

ధినిధి డబుల్‌ ధమాకా
Dhinidhi Desinghu

  • యూత్‌ ఒలింపిక్స్‌లో రెండో పతకం జూతీర్థాంక్‌కు కాంస్యం

డకార్‌ (సెనెగల్‌): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల పతక జోరు కొనసాగుతోంది. శుక్రవారం నాటి పోటీల్లో స్విమ్మ ర్లు రెండు పతకాలు కొల్లగొట్టారు. ఇప్పటికే బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో కాంస్యం నెగ్గిన ధినిధి దేశింగు 200 మీటర్ల ఈవెంట్‌లోనూ సత్తాచాటింది. 200 మీటర్ల ఫైనల్లో ధినిధి 2:02.28 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని మూడోస్థానంతో కాంస్యం అందుకుంది.


దీంతో ఒక యూత్‌ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్‌గా 16 ఏళ్ల ధినిధి రికార్డు సృష్టించింది. ఇక, బాలుర 200 మీటర్ల బటర్‌ఫ్లయ్‌ ఈవెంట్‌లో అసోంకు చెందిన తీర్థాంక్‌ పెగు కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఫైనల్లో తీర్థాంక్‌ 2:01.25 సెకన్ల టైమింగ్‌తో తృతీయస్థానంలో నిలిచాడు. దీంతో యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున పతకం నెగ్గిన తొలి పురుష స్విమ్మర్‌గా అరుదైన ఘనతను అందుకున్నాడు.


ఈ వార్తలనూ చదవండి:

జోరు సాగనీ..

టెస్టులకు షమి వీడ్కోలు

ప్రత్యేక ప్రదర్శనకు దాదా ‘లార్డ్స్‌’ జెర్సీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 07 , 2026 | 01:33 AM