Share News

వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్

ABN , Publish Date - Jul 13 , 2026 | 10:49 AM

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచానికి కూడా విస్తరించింది. ఆదివారం జరిగిన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వైభవ్.. కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు టెన్నిస్ ప్రపంచానికి కూడా విస్తరించింది. ఆదివారం జరిగిన వింబుల్డన్ 2026 పురుషుల సింగిల్స్ ఫైనల్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన వైభవ్.. కొత్త లుక్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అయితే ఈ పోరుకు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్, స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మలకు కూడా హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


‘గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ను స్టేడియంలో ప్రత్యక్షంగా చూడటం ఇదే తొలిసారి. వింబుల్డన్ ఫైనల్ పోరును చూడాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ప్లేయర్లు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారో దగ్గరగా చూడటం మంచి అనుభవం. నాలుగేళ్లుగా టెన్నిస్‌ను క్రమంగా చూస్తున్నా. రాఫెల్ నాదెల్, నొవాక్ జకోవిచ్ మ్యాచ్‌లు ఎక్కువగా చూసేవాడిని. ఇప్పుడు జకోవిచ్‌కు పెద్ద అభిమానిని. అల్కరాజ్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఈసారి అతడు బరిలోకి దిగకపోవడం నిరాశ కలిగించింది’ అని వైభవ్ వెల్లడించాడు. తన సూట్ గురించి వ్యాఖ్యాత ప్రశ్నించగా.. ‘ఫ్యాషన్ కోసం ప్రత్యేకంగా ఏమీ చేయలేదు. తొందరలో దొరికిన దుస్తులే వేసుకున్నా. సూట్ సెలక్ట్ చేయడంలో అభిషేక్ భయ్యా సహాయం చేశాడు’ అని తెలిపాడు. ఒకవేళ టెన్నిస్ డబుల్స్ ఆడాల్సి వస్తే ఎవరిని భాగస్వామిగా ఎంచుకుంటావన్న ప్రశ్నకు.. ‘అభిషేక్ భయ్యానే ఎంచుకుంటా. క్రికెట్‌లో మేమిద్దరం ఓపెనింగ్ భాగస్వాములం. అతడితో బ్యాటింగ్ చేయడం ఎంతగా ఆస్వాదిస్తానో, టెన్నిస్‌లోనూ అతడితోనే డబుల్స్ ఆడాలని కోరుకుంటా’ అంటూ ఫన్నీగా సమాధానమిచ్చాడు.


ఇవి కూడా చదవండి:

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్

Updated Date - Jul 13 , 2026 | 10:49 AM