అహో.. అర్జెంటీనా!
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:28 AM
వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతోంది. చివరి వరకు పోరాడే సామర్థ్యాన్ని వదలకుండా బలహీన కేప్‌వెర్డె, ఈజిప్టు జట్లపై గెలిచిన మాదిరే...
సెమీ్‌సకు మెస్సీ సేన
స్విట్జర్లాండ్‌పై 3-1తో విజయం
వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతోంది. చివరి వరకు పోరాడే సామర్థ్యాన్ని వదలకుండా బలహీన కేప్‌వెర్డె, ఈజిప్టు జట్లపై గెలిచిన మాదిరే.. ఆదివారం స్విట్జర్లాండ్‌పై ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో మెస్సీ సేన 112వ నిమిషంలో జూలియన్ అల్వరెజ్ లాంగ్ రేంజ్ గోల్‌తో ఆధిక్యం సాధించి, మార్టినెజ్ ఫినిషింగ్ టచ్‌తో సెమీ్‌సలోకి అడుగుపెట్టింది. అయితే స్విస్ మాత్రం పది మందితోనే అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. మరో క్వార్టర్స్‌లో సంచలన నార్వే ప్రస్థానం ముగిసింది. స్టార్ స్ట్రయికర్ హాలాండ్‌కు చెక్ పెడుతూ ఇంగ్లండ్ వ్యూహాత్మక ఆటతీరుతో సెమీస్ బెర్త్ పట్టేసింది.
నాతో సరిగా మాట్లాడు..
కాన్సాస్ సిటీ: డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా ఫిఫా వరల్డ్‌కప్ సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం ఉదయం స్విట్జర్లాండ్‌తో హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 3-1 తేడాతో గెలిచింది. బుధవారం రాత్రి జరిగే సెమీ్‌సలో ఈ జట్టు ఇంగ్లండ్‌తో తలపడనుంది. అర్జెంటీనా తరఫున అలెక్సిస్ అలిస్టర్ (10వ నిమిషంలో), జులియన్ అల్వరెజ్ (112), లౌటరో మార్టినెజ్ (120+1) గోల్స్ సాధించారు. స్విస్ నుంచి డాన్ ఎన్‌డోయో (67) ఏకైక గోల్ అందించాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో లియోనెల్ మెస్సీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయాడు. దీంతో అతడి వరుస పది మ్యాచ్‌ల గోల్స్ రికార్డుకు బ్రేక్ పడింది.
ఆరంభంలోనే ఆధిక్యంతో..
మ్యాచ్ ఆరంభమైన పదో నిమిషంలోనే అర్జెంటీనా బోణీ చేసింది. మెస్సీ అందించిన కార్నర్ పాస్‌ను అలెక్సిస్ అమాంతం గాల్లోకి ఎగిరి హెడర్‌తో గోల్ చేశాడు. తాజా టోర్నీలో అతడికిదే తొలి గోల్ కాగా జట్టుకు కూడా ఫాస్టెస్ట్ గోల్. ఇక 43వ నిమిషంలో స్విస్‌కు ఫ్రీకిక్ లభించినా రెమో ఫ్రూలర్ దాన్ని క్రాస్‌బార్ పైనుంచి పంపండంతో వృథా అయ్యింది. ఆ వెంటనే స్విస్ ఫార్వర్డ్ ఎంబోలోకు ఎల్లో కార్డ్ లభించింది. ద్వితీయార్ధంలో స్విస్ ఆటగాళ్లు ఎదురుదాడికి దిగారు. అటు పటిష్ట డిఫెన్స్‌తో మెస్సీని కట్టడి చేయగలిగారు. పదేపదే అర్జెంటీనా గోల్‌పోస్ట్ వైపు సాగి ఒత్తిడి పెంచారు. చివరికి 67వ నిమిషంలో ఫలితం దక్కింది. రోడ్రిగెజ్ పాస్‌ను ఎలాంటి తప్పిదం లేకుండా ఎన్‌డోయే గోల్‌గా మల్చడంతో స్విస్ 1-1తో సమం చేసింది. కానీ ఆ తర్వాత స్విస్ జోరుపై రెఫరీ నీళ్లుజల్లాడు. 72వ నిమిషంలో అర్జెంటీనా ఒత్తిడి మేరకు ఎంబోలోకు రెండోసారి ఎల్లోకార్డ్ ఇవ్వడంతో తను మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో స్విస్ పది మందితోనే ఆడినా మ్యాచ్‌ను అదనపు సమయం వరకు తీసుకెళ్లగలిగింది. అందులోనూ గట్టి పోటీనే ఇచ్చినా చివర్లో రెండు గోల్స్ సమర్పించుకుని మూల్యం చెల్లించుకుంది.
రెడ్‌కార్డ్ వివాదం
అర్జెంటీనాను వివాదాలు వీడడం లేదు. ఎంబోలోకు రెడ్ కార్డ్ ఇవ్వడం సరికాదని స్విట్జర్లాండ్ ఆరోపిస్తోంది. 72వ నిమిషంలో ఎంబోలోను అడ్డుకుని కిందపడేసినందుకు అర్జెంటీనా మిడ్‌ఫీల్డర్ పరెడె్‌సకు రెఫరీ ఎల్లో కార్డ్ చూపించాడు. కానీ వీఏఆర్‌లో మాత్రం పరెడెస్ అతడిని తాకకముందే ఎంబోలో కిందపడినట్టు తేలింది. దీంతో రెఫరీ ఎంబోలోకు ఎల్లో కార్డ్ చూపించాడు. ఇది తనకు రెండో ఎల్లో కార్డ్ కావడంతో మైదానం వదలాల్సి వచ్చింది. స్విస్ ఆటగాళ్లు ఎంత వాదించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎంబోలోపై రెఫరీ కఠిన నిర్ణయం తీసుకున్నాడనే కామెంట్స్‌తో పాటు, వీఏఆర్ నిర్ణయాలు అర్జెంటీనాకు అనుకూలంగా మారుతున్నాయంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మ్యాచ్ ప్రథమార్ధంలో రెఫరీ పిన్హిరోపై అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్విస్‌కు ఫ్రీకిక్ లభించిన సమయంలో అర్జెంటీనా డిఫెన్సివ్ వాల్‌లో ఉన్న మెస్సీని నిబంధనల ప్రకారం దూరం జరగాలని రెఫరీ సూచించాడు. అయితే అతడు మాట్లాడిన తీరుతో ఆగ్రహానికి గురైన మెస్సీ.. ‘నాతో మర్యాదగా మాట్లాడు. నన్ను అగౌరవపరచవద్దు. నేను నీతో సరిగానే మాట్లాడాను కదా’ అంటూ వేలెత్తి చూపుతూ రెఫరీకి సమాధానమివ్వడం చర్చనీయాంశమైంది.
ఇవి కూడా చదవండి:
భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!