Share News

భళా.. ఇంగ్లండ్‌

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:22 AM

ఫిఫా వరల్డ్‌క్‌పలో నార్వే సంచలన ఆటతీరుకు బ్రేక్‌ పడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ 2-1తో గెలిచి సెమీ్‌సలో అడుగుపెట్టింది. అర్జెంటీనాతో జరిగే సెమీ్‌సలో...

భళా.. ఇంగ్లండ్‌

నార్వేపై 2-1తో విజయం

సెమీ్‌సలో ప్రవేశం

బెల్లింగ్‌హామ్‌ డబుల్‌ ధమాకా

మయామి: ఫిఫా వరల్డ్‌క్‌పలో నార్వే సంచలన ఆటతీరుకు బ్రేక్‌ పడింది. ఆదివారం తెల్లవారుజామున జరిగిన క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌ 2-1తో గెలిచి సెమీ్‌సలో అడుగుపెట్టింది. అర్జెంటీనాతో జరిగే సెమీ్‌సలో ఇంగ్లండ్‌ తలపడనుంది. స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ బెల్లింగ్‌హామ్‌ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరోసారి హీరోగా మారాడు. 45+2, 93వ నిమిషాల్లో రెండు గోల్స్‌ సాధించి జట్టును గట్టెక్కించాడు. అటు నార్వే తరఫున ఆండ్రియాస్‌ షెల్డెరప్‌ (36) ఏకైక గోల్‌ అందించాడు. ఇక స్టార్‌ స్ట్రయికర్‌ హాలాండ్‌పై నార్వే ఆశలు పెట్టుకున్నా తను ప్రభావం చూపలేకపోయాడు. విపరీతమైన వేడిమి కారణంగా మైదానంలో చురుగ్గా కదల్లేకపోయాడు. ఈ మ్యాచ్‌కు ముందు తను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గోల్స్‌ సాధించి జట్టు విజయాల్లో కీలకమైన విషయం తెలిసిందే. ప్రథమార్ధంలో తొలి గోల్‌ సాధించిన నార్వే ముందంజ వేసింది. కానీ ఇంజ్యూరీ సమయంలో బెల్లింగ్‌హామ్‌ గోల్‌తో స్కోరు 1-1తో సమమైంది. ఇక సెకండా్‌ఫలో హాలాండ్‌ 56వ నిమిషంలో గోల్‌ సాధించినా వీఏఆర్‌లో అది ఫౌల్‌గా తేలింది. అలాగే ఇంగ్లండ్‌ కెప్టెన్‌ హ్యారీ కేన్‌ గోల్‌ను కూడా ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. ఇక నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో నిలవడంతో మ్యాచ్‌ అదనపు సమయానికి దారి తీసింది. అయితే 93వ నిమిషంలోనే బెల్లింగ్‌హామ్‌ రెండో గోల్‌తో ఇంగ్లండ్‌ పటిష్ట స్థితికి చేరింది. ఆ తర్వాత నార్వే ఎంత ప్రయత్నించినా ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేక చతికిలపడింది. 106వ నిమిషంలో హాలాండ్‌ అలసటతో మైదానం వీడడం కూడా దెబ్బతీసింది.

హాలాండ్‌కు పాస్‌ ఇచ్చుంటే..

స్ట్రయికర్‌ అలెగ్జాండర్‌ సోర్లోత్‌ చేసిన తప్పిదంతో నార్వే జట్టు భారీ మూల్యమే చెల్లించుకుంది. నార్వే తొలి గోల్‌ తర్వాత 43వ నిమిషంలో రెండో గోల్‌ అవకాశాన్ని చేజార్చుకుంది. ఆ సమయంలో సోర్లోత్‌ డి బాక్స్‌ ముందు హాలాండ్‌కు పాస్‌ ఇవ్వకుండా తాత్సారం చేశాడు. ఆ సమయంలో ప్రత్యర్థి డిఫెండర్‌ ఒక్కరే వీరి మధ్య ఉండగా.. హాలాండ్‌ చాలా సులువుగా గోల్‌ చేసే పరిస్థితి నెలకొంది. కానీ సోర్లోత్‌ తనే గోల్‌ చేయాలనుకుని విఫలమయ్యాడు. అతడి చర్య నార్వే కొంపముంచిందంటూ ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ టోర్నీలో సోర్లోత్‌ ఒక్క గోల్‌ కూడా చేయకపోవడం గమనార్హం.

ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 13 , 2026 | 05:22 AM