Share News

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:52 PM

ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. వారు రానున్న ఇంగ్లండ్‌తో వన్డే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు దూరమవ్వనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. వారిద్దరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది.

జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..
BCCI

ఇంటర్నెట్ డెస్క్: వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో భాగంగా స్టార్ ప్లేయర్లు హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి గాయపడిన సంగతి తెలిసిందే. వారు రానున్న ఇంగ్లండ్‌తో వన్డే, జింబాబ్వేతో టీ20 సిరీస్‌లకు దూరమవ్వనున్నట్లు బీసీసీఐ ధ్రువీకరించింది. వారిద్దరి స్థానంలో ప్రిన్స్ యాదవ్, రవి బిష్ణోయ్‌లను రీప్లేస్‌మెంట్‌గా ప్రకటించింది.


ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 సందర్భంగా హర్షిత్ రాణా కుడి తొడ వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉందంటూ ఫిర్యాదు చేశాడు. అనంతరం నిర్వహించిన స్కానింగ్‌లో అతడికి కండరాల గాయం ఉన్నట్లు తేలింది. దీంతో ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అతడిని దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌కు అవకాశం లభించింది. ఐపీఎల్-2026లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ తరఫున ఆకట్టుకున్న ప్రిన్స్, ఇటీవల ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లోనూ మెరుగైన బౌలింగ్‌తో సెలెక్టర్లను మెప్పించాడు. సిరీస్‌లో భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోయినా, అతడి ప్రదర్శన సెలక్టర్లను ఆకట్టుకుంది.


కాగా మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మరోవైపు జులై 23 నుంచి జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు భారత జట్టు సిద్ధమవుతోంది.


ఇవి కూడా చదవండి:

నాతో మర్యాదగా మాట్లాడండి.. రిఫరీతో మెస్సి వాగ్వాదం!

భారత్ వరుస ఓటములు.. కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు!

Updated Date - Jul 12 , 2026 | 05:37 PM