టీ20ల్లో వరుస ఓటములు.. గంభీర్‌పై బీసీసీఐ అసంతృప్తి
ABN , Publish Date - Jul 12 , 2026 | 06:22 PM
టీమిండియా వరుస ఓటములు ఎదుర్కొంటున్న నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌పై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో అభిమానులను టీమిండియా నిరాశ పరుస్తోంది. పసికూన ఐర్లాండ్‌తో టోర్నీలో ఓటమి తరువాత ఇంగ్లండ్‌తో టోర్నీలో కూడా దారుణ ఓటమిని ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఇతర సభ్యులపై బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మంగళవారం నుంచి ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్ మేనేజ్‌మెంట్‌పై ఒత్తిడి మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో గంభీర్ అసిస్టెంట్ టెన్ దస్కతే, బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ తమ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీసీసీఐతో కాంట్రాక్ట్ ముగిసిన తరువాత తప్పుకోవాలని అనుకుంటున్నట్టు సమాచారం. టీమ్‌తో కొనసాగే విషయంలో దస్కతే అంత సుముఖంగా లేడని తెలుస్తోంది. మోర్కెల్ కూడా సందిగ్ధంలోనే ఉన్నాడు. తనకున్న ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నాడు. బీసీసీఐ కూడా ఈ విషయమై దృష్టిసారించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దస్కతే ఇప్పటికే ఒక ఐపీఎల్ ఫ్రాంఛైజీతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
2024లో టీమిండియా కోచింగ్ బాధ్యతలు స్వీకరించాక గంభీర్ ఈ ఇద్దరినీ ఏరికోరి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. టీమిండియా ఘోర ఓటముల నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ కూడా తప్పుకోవాల్సి రావచ్చని సమాచారం. ఫీల్డింగ్ ప్రమాణాలు అంతకంతకూ పడిపోతున్న నేపథ్యంలో ఫీల్డింగ్ కోచ్‌పై బోర్డు అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
జట్టుకు హర్షిత్- వరుణ్ చక్రవర్తి దూరం.. వారి స్థానంలో ఆ ఇద్దరు..
వైభవ్‌ను అందుకే తప్పించాం.. మౌనం వీడిన శ్రేయస్ అయ్యర్