డబ్బు కోసం రాయలేదు.. శాండ్‌పేపర్ వివాదంపై విమర్శల వేళ ఖవాజా క్లారిటీ
ABN , Publish Date - Nov 16 , 2026 | 01:25 PM
2018 శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథలో రాసిన పలు సంచలన విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: 2018 శాండ్‌పేపర్ వివాదంపై కొద్దిరోజులుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా.. తన ఆత్మకథలో రాసిన పలు సంచలన విషయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాండ్‌పేపర్ వివాదం గురించి జట్టులో అందరికీ తెలుసని.. కానీ స్టీవ్ స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌లు మాత్రమే బాధ్యత తీసుకున్నారని వెల్లడించాడు. దీనికి వార్నర్ మద్దతు ప్రకటించగా, ప్యాట్ కమిన్స్ ఖండించాడు. ఈ క్రమంలో ఖవాజా డబ్బు కోసమే ఈ విషయాలన్నింటీని ప్రస్తావించాడనే విమర్శలు కూడా వినిపించాయి. ఇదే విషయంపై ఖవాజా స్పందించి క్లారిటీ ఇచ్చాడు.
‘నా ఆత్మకథ పుస్తకాలు అమ్ముడవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ విషయాలన్నీ ప్రస్తావించలేదు. దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు. నాకు ఇంకా డబ్బు అవసరం లేదు. ఇంకా డబ్బు వచ్చినంత మాత్రాన నా జీవితంలో పెద్దగా మార్పేమీ జరగదు. డేవిడ్ వార్నర్‌కు చాలా కాలం క్రితం ఓ మాట ఇచ్చాడు. శాండ్‌పేపర్ వివాదం గురించి వార్నర్ ఎనిమిదేళ్లుగా ఓ అపరాధభావాన్ని మోస్తున్నాడు. నా పుస్తకంలో నేనేం రాయాలని అనుకుంటున్నానో అవన్నీ వార్నర్‌కు రెండు నెలల ముందే చెప్పాను. ఇప్పటికైనా ప్రజలకు నిజాలు తెలియాలనేదే నా ఉద్దేశం’ అని ఖవాజా స్పష్టం చేశాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం