సచిన్‌లా ఎదుగుతాడా? కాంబ్లీలా మిగిలిపోతాడా?.. వైభవ్‌పై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Nov 16 , 2026 | 12:34 PM
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ భవిష్యత్తుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సచిన్‌లా ఎదుగుతాడా? వినోద్ కాంబ్లీలా మిగిలిపోతాడా? అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రికెట్ భవిష్యత్తుపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన వైభవ్.. అవకాశం వచ్చిన ప్రతిసారీ భారీ షాట్లతో చెలరేగుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బిహార్ జట్టుకు కెప్టెన్‌గా కూడా బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్.. వైభవ్ ప్రతిభను ప్రశంసిస్తూనే.. కెరీర్ విషయంలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని సూచించాను. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘వైభవ్ సూర్యవంశీ దూకుడైన బ్యాటింగ్ చూడముచ్చటగా అనిపిస్తుంది. ఫోర్లు, సిక్సర్లు కొడుతున్న యువ ఆటగాళ్ల ఆటను చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఇష్టపడతారు. అయితే అభిషేక్ శర్మ, సంజు శాంసన్‌ల వల్ల వైభవ్‌కు ఎక్కువ అవకాశాలు రావడం లేదనే వార్తలను నేనూ గమనిస్తున్నా. 15 ఏళ్ల వయసులో జాతీయ జట్టులోకి వచ్చినంత మాత్రాన వెంటనే అవకాశాలు వస్తాయని ఆశించకూడదు. వైభవ్‌కు ఇంకా చాలా సమయం ఉంది. అతడి ప్రతిభను ఎలాంటి కొరత లేదు. కాబట్టి అవకాశాల కోసం ఎదురుచూస్తూ తనను తాను సిద్ధం చేసుకోవాలి.
ప్రస్తుతం అతడి దృష్టి మొత్తం క్రికెట్‌పైనే ఉండాలి. డబ్బు, పేరు ప్రఖ్యాతులు, ఇతర ఆకర్షణలకు దూరంగా ఉంటూ ఆటను మెరుగుపరుచుకోవాలి. 18, 19 ఏళ్లు వచ్చేసరికి పార్టీలు, ఇతర ఆకర్షణలు ఎదురవుతాయి. వాటి మధ్య క్రికెట్‌పై ఏకాగ్రతను కొనసాగించడం ముఖ్యం. అయితే వైభవ్.. సచిన్ టెండూల్కర్‌లా ఎదుగుతాడా? లేక వినోద్ కాంబ్లీలా మిగిలిపోతాడా? అనేది ఈ దశలో చెప్పడం చాలా కష్టం. ఒకప్పుడు వినోద్ కాంబ్లీకి సచిన్ కంటే ఎక్కువ ప్రతిభ ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యేవి. అయితే ఇద్దరి క్రికెట్ ప్రయాణాలు భిన్నంగా సాగాయి. సచిన్ టెస్టులు, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా తన కెరీర్‌ను ముగించగా.. కాంబ్లీ అంతర్జాతీయ కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. చిన్న వయసులోనే అద్భుతమైన బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్‌కు ఇప్పుడు స్థిరంగా రాణించడం కీలకం’ అని కపిల్ దేవ్ వివరించాడు.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం
ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం