Share News

సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు.. వీడియో వైరల్

ABN , Publish Date - Nov 16 , 2026 | 11:49 AM

పదేళ్ల తర్వాత బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ భారత పర్యటనకు వచ్చారు. ఇందులో భాగంగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి బ్రిటన్ యువరాజు దంపతులు ముంబై వీధుల్లో సందడి చేశారు.

సచిన్‌తో కలిసి గల్లీ క్రికెట్ ఆడిన బ్రిటన్ యువరాజు.. వీడియో వైరల్
Prince William, Sachin Tendulkar

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు పదేళ్ల తర్వాత బ్రిటన్ యువరాజు దంపతులు ప్రిన్స్ విలియం, ప్రిన్సెస్ కేట్ మిడిల్టన్ భారత పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో కలిసి బ్రిటన్ యువరాజు దంపతులు ముంబై వీధుల్లో సందడి చేశారు. నగరంలోని ప్రముఖ ప్రాంతమైన బల్లార్డ్ ఎస్టేట్‌లో వీరు కలిసి కనిపించారు. భారత్‌లోని పురాతన ఫొటోగ్రఫీ స్టూడియోల్లో ఒకటైన హామిల్టన్ స్టూడియోస్ వెలుపల ఈ ముగ్గురూ సందడి చేశారు. అనంతరం ముంబై స్ట్రీట్ ఫుడ్‌ను టేస్ట్ చేశారు.


ప్రిన్స్ విలియం, కేట్ దంపతులకు ముంబైతో పాటు క్రికెట్‌తోనూ అనుబంధం ఉంది. 2016 ఏప్రిల్‌లో తొలిసారి భారత్‌లో అధికారిక పర్యటనకు వచ్చినప్పుడు స్థానిక చిన్నారులతో కలిసి గల్లీ క్రికెట్ ఆడారు. ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ముంబైకి వచ్చిన బ్రిటన్ యువరాజు.. ఓ పాఠశాలలో సచిన్‌తో కలిసి క్రికెట్ కూడా ఆడారు. ఆ తర్వాత యువ క్రికెటర్లతో కలిసి గల్లీ క్రికెట్‌ ఆడి వారిని ఉత్సాహపరిచారు. తనను ఔట్‌ చేసిన యువ క్రీడాకారిణిని ప్రిన్స్‌ విలియం అభినందించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు సచిన్‌ సూచనలు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.


ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 16 , 2026 | 11:49 AM