Share News

వైభవ్ సూర్యవంశీని టీజ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్

ABN , Publish Date - Sep 06 , 2026 | 01:40 PM

దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ క్రమంలో సౌత్ జోన్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైభవ్ సూర్యవంశీని టీజ్ చేసిన తిలక్ వర్మ.. వీడియో వైరల్
Tilak Varma, Vaibhav Suryavanshi

ఇంటర్నెట్ డెస్క్: దులీప్ ట్రోఫీలో ఈస్ట్, సౌత్ జోన్ జట్లు ఫైనల్ పోరులో తలపడుతున్నాయి. ఈ క్రమంలో సౌత్ జోన్ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య చోటు చేసుకున్న ఓ సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్‌ దూకుడుగా ఆడుతుండటంతో తిలక్ వర్మ అతడిని సరదాగా స్లెడ్జ్ చేశాడు. ఆ తర్వాత 15 ఏళ్ల వైభవ్ 44 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఈస్ట్ జోన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. భారీ షాట్లతో విరుచుకుపడుతున్న వైభవ్‌ను ఆపడానికి సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ తెగ ప్రయత్నించాడు. ఆఖరికి వైభవ్ దగ్గరికి వెళ్లి ‘వైస్ కెప్టెన్.. ఏంటిది?’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగినట్లు వైరల్ అవుతోన్న వీడియోలో కనిపించింది. అయితే దీని తర్వాత ఇద్దరూ నవ్వుకోవడంతో విషయం పెద్ద సీరియస్‌గా లేదని స్పష్టమైంది. అనూహ్యంగా ఈ ఘటన తర్వాత వైభవ్ 44(37 బంతుల్లో; 5 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వద్ద పెవిలియన్ చేరాడు.


ఇక మ్యాచ్ విషయానికొస్తే, టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టు ఈ వార్త రాసే సమయానికి 3 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్(72) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. వైభవ్(44), సుదీప్ కుమార్(6) పరుగులు చేశాడు. ప్రస్తుతం క్రీజులో శిఖర్(34*), ఇషాన్ కిషన్(0*) ఉన్నారు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురన, వి.మిలింద్ తలొక వికెట్ పడగొట్టారు.


ఇవి కూడా చదవండి:

షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!

ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?

Updated Date - Sep 06 , 2026 | 01:40 PM