ప్లేయర్ల ఫోన్ల స్వాధీనం.. పాకిస్థాన్ క్రికెట్‌లో అసలేం జరుగుతోంది?
ABN , Publish Date - Sep 06 , 2026 | 08:39 AM
పాకిస్థాన్ క్రికెటర్‌లో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెటర్ల ఫోన్లను పీసీబీ స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ క్రికెటర్‌లో వివాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇంగ్లండ్‌తో జరుగనున్న మూడో టెస్టుకు ముందు పాక్ క్రికెటర్ల ఫోన్లను పీసీబీ స్వాధీనం చేసుకున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఆటగాళ్ల ఫోన్లను బోర్డు కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపింది. అయితే పీసీబీ అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? అసలు దేనిపై దర్యాప్తు జరుగుతోంది? అనే విషయాలపై స్పష్టత లేదు. దీనిపై త్వరలోనే మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా అధికారికంగా స్పందించలేదు.
ఇంగ్లండ్-పాకిస్థాన్ టెస్టు సిరీస్‌లో ఇప్పటికే పాక్ క్రికెట్ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టుల్లో పాకిస్థాన్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో మూడో టెస్టుకు ముందు ఏకంగా ఏడుగురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించి స్వదేశానికి పంపింది. హెడ్ కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమల్ గుల్‌లపై కూడా వేటు వేసింది. వారి స్థానంలో కొత్త ప్లేయర్లను, కోచ్‌లను నియమించింది.
ఫోన్ల వ్యవహారంపై ఉత్కంఠ
ఇప్పటికే జట్టు ఎంపిక, కోచింగ్ సిబ్బంది మార్పులు, ఆటగాళ్లపై వేటు వంటి వరుస పరిణామాలతో పాక్ క్రికెట్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆటగాళ్ల ఫోన్లను పీసీబీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తోందన్న వార్తలు మరింత కలకలం రేపుతున్నాయి. అసలు పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది? అని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అయితే దర్యాప్తు ఏ అంశంపై జరుగుతోంది? ఫోన్లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? అన్న ప్రశ్నలకు పీసీబీ అధికారికంగా సమాధానం ఇవ్వాల్సి ఉంది. మూడో టెస్టుకు ముందే ఈ వ్యవహారంపై మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా కప్.. పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు