షఫాలీని ఔట్ చేసి.. పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనా ఓవరాక్షన్!
ABN , Publish Date - Sep 06 , 2026 | 10:14 AM
మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన వేళ.. సోషల్ మీడియాలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. షఫాలీ వర్మను ఔట్ చేశాక ఫాతిమా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన వేళ.. సోషల్ మీడియాలో ఓ ఘటన చర్చనీయాంశంగా మారింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. భారత స్పిన్నర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. ఛేదనలో 8.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పడిన ఆ మూడు వికెట్లు పాకిస్థాన్ కెప్టెన్ ఫాతిమా సనానే తీసింది. భారత ఓపెనర్ షఫాలీ వర్మను ఔట్ చేశాక ఫాతిమా వ్యవహరించిన తీరుపై ఇప్పుడు నెట్టింట విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
56 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు షఫాలీ వర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చింది. సాదియా ఇక్బాల్ వేసిన తొలి బంతినే లాంగాఫ్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. ఆ తర్వాత 12 పరుగుల వద్ద ఫాతిమా బౌలింగ్‌లో పెవిలియన్ చేరింది. షఫాలీ వికెట్ పడిన తర్వాత ఫాతిమా ‘బయటకు వెళ్లు’ అన్నట్లు చేతులతో పొగరుగా సైగలు చేసింది. ఆమె వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘ఇంత అతి అవసరమా’, ‘ఆడటం చేతకాదు గానీ ఈ బిల్డప్ ఎందుకు?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా కప్.. పాకిస్థాన్‌పై నిర్దాక్షిణ్యంగా ఆడాం: హర్మన్‌ప్రీత్ కౌర్
చరిత్ర సృష్టించిన షఫాలీ వర్మ.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు