ఐపీఎల్ 2026: తిలక్ వర్మ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ ఎంతంటే?
ABN , Publish Date - Apr 20 , 2026 | 09:26 PM
ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. గుజరాత్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 199 పరుగులు చేసింది. గుజరాత్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ ఎట్టకేలకు ఫామ్ అందుకుని సెంచరీతో చెలరేగాడు. గుజరాత్ బౌలర్లపై సిక్సర్లు, బౌండరీలతో విరుచుపడ్డాడు. 45 బంతుల్లో 7 సిక్సర్లు, 8 ఫోర్లతో 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరో బ్యాటర్ నమన్ ధీర్(45) త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచులో సెంచరీ చేసిన డికాక్(13), ఎంఐ తరఫున అరంగేట్రం చేసిన డానిశ్ మాలేవార్(2) వెనువెంటనే పెవిలియన చేరారు. ఆ తర్వాత వచ్చిన నమన్ ధీర్(45; 32 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. సూర్యకుమార్ యాదవ్(15), హార్దిక్ పాండ్య(15) మరోసారి నిరాశపర్చారు. తిలక్ వర్మ(101*) సెంచరీతో చెలరేగాడు. రూథర్‌ఫర్డ్(1*) నాటౌట్‌గా నిలిచాడు. గుజరాత్ బౌలర్లలో రబాడా 3 వికెట్లు తీశాడు. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
ఐపీఎల్ 2026: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్.. టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్
సిక్సర్ల పిడుగు వైభవ్ సూర్యవంశీ మళ్లీ ఏడ్చేశాడు.. వీడియో వైరల్