Share News

సీజేపీ నిరసనలకు మద్దతు తెలిపిన సంజయ్ మంజ్రేకర్

ABN , Publish Date - Oct 10 , 2026 | 09:36 PM

భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇవాళ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు.

సీజేపీ నిరసనలకు మద్దతు తెలిపిన సంజయ్ మంజ్రేకర్
Sanjay Manjrekar

స్పోర్ట్స్ డెస్క్: భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఇవాళ(శనివారం) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) భారీ నిరసనలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నిరసనలకు మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కని మంజ్రేకర్ వెల్లడించాడు. ఎక్స్ వేదికగా ప్రభుత్వ తీరును ఎండగట్టాడు.


'శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు. చివరిసారిగా నేను విన్నప్పుడు భారతదేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉంది 'అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. సీజేపీ ఇచ్చిన పిలుపునకు దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి భారీ మద్దతు లభించినా.. క్రికెట్, సినీ ప్రముఖులు మాత్రం మౌనంగా ఉన్నారు. కానీ సంజయ్ మంజ్రేకర్ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.


మరోవైపు సీజేపీ నిరసనలను ఢిల్లీ పోలీసులు, కేంద్రం ప్రభుత్వం కలిసి అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పోలీసులను మోహరించాయి. ఢిల్లీకి బయటి నుంచి రాకపోకలు నిలిపివేయడంతో పాటు భారీ ఎత్తున ఆంక్షల్ని అమలుచేస్తున్నారు. సీజేపీ నేతలు అభిజీత్ దీప్కే, అశుతోశ్, సౌరవ్ దాస్‌లను విమానంలోనే అదుపులోకి తీసుకుని అజ్ఞాత ప్రాంతానికి తరలించారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రతిపక్ష నేతలు తప్పుబడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

వారిని విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష.. కేంద్రానికి వాంగ్‌చుక్ హెచ్చరిక

ముంబైలో ఉద్రిక్తత.. నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా 400 మందికి పైగా ఆందోళనకారుల అరెస్టు!

'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల లేఖ..

Updated Date - Oct 10 , 2026 | 09:44 PM