8 యుద్ధాలు ఆపాను.. ఇజ్రాయెలీలను కాపాడాను.. నోబెల్ రాకపోవడంపై ట్రంప్ అసహనం..
ABN , Publish Date - Oct 10 , 2026 | 07:43 PM
నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఇజ్రాయెల్ బందీల విడుదలకు కృషి చేశానని, ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అడ్డుకున్నానని పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: నోబెల్ శాంతి బహుమతి తనకు రాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, ఇజ్రాయెల్ బందీల విడుదలకు కృషి చేశానని, ఇరాన్ అణ్వాయుధాన్ని పొందకుండా అడ్డుకున్నానని పేర్కొన్నారు. అలాంటి తనకు ఈ పురస్కారం ఎందుకు లభించలేదని ప్రశ్నించారు. తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి (Donald Trump Nobel Peace Prize).
తాను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించానని, మరో రెండు సంఘర్షణలకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తున్నానని ట్రంప్ తన పోస్టులో పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన బందీలందరినీ తిరిగి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించానని, మరణించిన 28 మంది బందీల అవశేషాలను కూడా తిరిగి తీసుకొచ్చామని ఆయన తెలిపారు. వెనెజువెలాకు సంబంధించిన సైనిక పరిణామాల్లోనూ తన విజయాలను ప్రస్తావించారు (Trump settled 8 wars).
ఇన్ని విజయాలు సాధించినప్పటికీ తనకు లేదా అమెరికాకు నోబెల్ శాంతి బహుమతి లభించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు (Navi Pillay Nobel Prize). దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయవాది, మాజీ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఉన్నత కమిషనర్ నవనేతెమ్ నావి పిళ్లైకి తాజాగా నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించారు. ఈ నిర్ణయంపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నావి పిళ్లై ఎవరో తనకు తెలియదని, ఆమెకు బహుమతి ఇవ్వడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి