Share News

ఎలాన్ మస్క్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్!

ABN , Publish Date - Oct 10 , 2026 | 08:40 PM

భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ మించిన స్వార్థపరుడు మరొకరు లేరని విమర్శించాడు.

ఎలాన్ మస్క్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ ఫైర్!
Elon Musk

భారత ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌పై టీమిండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎలాన్ మస్క్ మించిన స్వార్థపరుడు మరొకరు లేరని విమర్శించాడు. టెస్లాకు ఎక్కడ పోటీ అవుతుందోనని బీవైడీ కంపెనీని అమెరికాలోకి రాకుండా అడ్డుకున్న మస్క్.. భారత్ విషయంలో మాత్రం సూక్తులు చెబుతున్నాడని ప్రసాద్ మండిపడ్డాడు.


వెంకటేశ్ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ... 'తన టెస్లా కార్ల సేల్స్ ఎక్కడ పడిపోతాయో అనే భయంతో బివైడి (BYD) కంపెనీని యూఎస్ఏలోకి రాకుండా అడ్డుకున్న అధ్యక్షుడుుఎలాన్ మస్క్ ప్రవర్తన అస్సలు బాలేదు. కానీ భారత్‌కు వచ్చేసరికి మన జాతీయ భద్రతా హక్కుల గురించి మాట్లాడి అనవసరంగా వివాదం చేస్తున్నాడు. అతడు గొప్ప వ్యాపారవేత్తే. కానీ మనస్సులో చాలా ఈర్ష్య, స్వార్థం, కక్ష కలిగిన వ్యక్తి. గతంలో ట్రంప్ పేరు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉందని ఆరోపించాడు. తీరా తన వ్యాపారాలు దెబ్బతింటున్నాయని తెలిసి మౌనంగా ఉన్నాడు' అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు. భారత్ తరఫున 33 టెస్ట్‌లు, 161 వన్డేలు ఆడిన వెంకటేష్ ప్రసాద్.. 96, 196 వికెట్లు పడగొట్టాడు. 1990ల కాలంలో జవగల్ శ్రీనాథ్ - వెంకటేష్ ప్రసాద్‌ జోడీ భారత పేస్ బౌలింగ్ విభాగానికి ప్రధాన బలంగా ఉండేది.


స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు భారత్‌లో అనుమతుల ఇవ్వకుండా జాప్యంపై చేయడంపై ఎలాన్ మస్క్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలో అంబానీ గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపించారు. భారత ప్రధాని అంబానీ అంటూ ఎక్స్ వేదికగా సెటైర్లు పేల్చారు. ఈ వ్యాఖ్యలకు తాజాగా వెంకటేశ్ ప్రసాద్ పై విధంగా కౌంటర్ ఇచ్చాడు. మస్క్ సెటైర్లపై భారత ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఏ రంగంలోనూ గుత్తాధిపత్యానికి భారత్ అంగీకరించబోదని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి:

వారిని విడుదల చేయకపోతే మళ్లీ నిరాహారదీక్ష.. కేంద్రానికి వాంగ్‌చుక్ హెచ్చరిక

ముంబైలో ఉద్రిక్తత.. నటుడు ఇమ్రాన్ ఖాన్‌తో సహా 400 మందికి పైగా ఆందోళనకారుల అరెస్టు!

'సర్'కు మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల లేఖ..

Updated Date - Oct 10 , 2026 | 08:41 PM