పార్కులో కూర్చున్నందుకే అరెస్ట్ చేశారు: బీజేపీ నాయకుడి కుమార్తె..
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:45 PM
ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేపట్టిన నిరసనల నేపథ్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలో ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) చేపట్టిన నిరసనల నేపథ్యంలో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె యశస్వినీ రాజే సింగ్‌ను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆమె తన ఆవేదనను 'ఎక్స్' ద్వారా బయటపెట్టింది (BJP leader daughter detained).
బంగ్లా సాహిబ్ గురుద్వారా సమీపంలోని పార్కులో కూర్చున్న సమయంలో తనను అదుపులోకి తీసుకున్నారని యశస్విని (Yashaswinee Raje Singh) వెల్లడించింది. ప్రస్తుతం తనను కేశవ్ పురం పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు ఆమె తెలిపింది. ఢిల్లీలో సీజేపీ నిరసనలకు ముందు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సీజేపీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చింది. ఢిల్లీ అంతటా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పలు ఆంక్షలు విధించారు.
యశస్వినీ రాజే సింగ్ ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ సదర్ నియోజకవర్గానికి గతంలో ప్రాతినిధ్యం వహించిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే విక్రమ్ సింగ్ కుమార్తె (CJP protest Delhi). ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో పరీక్షా పత్రాల లీకేజీ ఆరోపణలకు సంబంధించి విద్యార్థులు చేపట్టిన నిరసనలకు ఆమె మద్దతు తెలిపారు. అప్పట్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆ ఆందోళనల్లో యశస్వినీ సీజేపీ ప్రచారానికి మద్దతుగా నిలిచారు.
ఇవి కూడా చదవండి..
భుజ్ భూకంపం.. నరేంద్ర మోదీ రాజకీయ జీవితాన్ని మలుపు తిప్పిన విపత్తు..
ఈ రోజు ఫోన్, టీవీ చూడొద్దని ముందే చెప్పాడు: అభిజిత్ దీప్కే తల్లి