ఆరేళ్లుగా జట్టులో ఎన్నో ఒడిదొడుకులను అనుభవించా: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
ABN , Publish Date - Mar 07 , 2026 | 08:45 PM
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ తుది పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ తుది పోరులో తలపడనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ఫైనల్‌లో ఎలాంటి వ్యూహాలతో బరిలోకి దిగుతున్నారనే ప్రశ్నలకు సూర్య సమాధానాలిచ్చారు.
‘ఫైనల్‌లోనూ నాణ్యమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. ఒకవేళ 250 పరుగులు చేస్తే సూపర్‌గా ఉంటుంది. అయితే దాని కోసం ఎలాంటి ఆలోచనలు, ప్రణాళికలు రూపొందించలేదు. పిచ్‌ను బట్టి అప్పటికప్పుడు ఆటలో మార్పులు చేసుకుంటాం. నాతో పాటు ప్లేయర్లు, స్టాఫ్, అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆరేళ్లుగా టీమిండియాలో నా ప్రయాణం సాగుతోంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులను అనుభవించా. ఇలాంటి మెగా టోర్నీలో జట్టుకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉంది’ అని సూర్య తెలిపాడు.
రోహిత్ వ్యూహాలనే ఫాలో అవుతా..
‘మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అడుగు జాడల్లోనే జట్టు కొనసాగుతోంది. కేవలం దారులు మాత్రమే వేరు. అతడి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. రోహిత్ వ్యూహాలనే ఎక్కువగా ఫాలో అవుతా. మరికొన్ని కొత్తవాటినీ అమలు చేసేందుకు ప్రయత్నించా. ఫైనల్‌లోనూ అదే వర్కౌట్ అవుతుందని ఆశిస్తున్నా. కుర్రాళ్లకు స్వేచ్ఛ ఇస్తే అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే క్లిష్ట పరిస్థితుల్లో మనం ఎంత నిశ్శబ్దంగా ఉంటే ఒత్తిడిని జయించడం అంత సులువు అవుతుంది. ఒత్తిడి లేకపోతే మజా ఏముంటుంది? జట్టులోని సభ్యులంతా పరస్పరం మాట్లాడుకుంటూ ఉంటాం. ఓ కుటుంబంలో కలిసిపోయాం. ఇక సంజు విషయానికొస్తే.. అదంతా అతడు పడిన శ్రమకు దక్కిన ఫలితం’ అని సూర్య వెల్లడించాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్