Share News

ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:06 PM

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ రసవత్తర సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కానుంది. ఈ నేపథ్యంలో చోకర్స్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు.

ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్
Dale Steyn

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం న్యూజిలాండ్, భారత్ జట్లు తుది పోరులో తలపడనున్నాయి. ఈ రసవత్తర సమరానికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా కానుంది. అయితే సెమీ ఫైనల్‌లో సౌతాఫ్రికాను చిత్తుగా ఓడించి.. కివీస్ ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ ఆసాంతం అజేయంగా నిలిచిన ప్రొటీస్.. సెమీ ఫైనల్‌లో పూర్తిగా తేలిపోయింది. ఫిన్ అలెన్ విధ్వంసకర శతకంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది. దీంతో మరోసారి సౌతాఫ్రికాను ‘చోకర్స్’ అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పించారు. ఈ చోకర్స్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ ఘాటుగా స్పందించాడు.


‘అందరూ సౌతాఫ్రికాను చోకర్స్ అని పిలుస్తుంటారు. కానీ నేను మాత్రం ఒకటే చెప్పాలనుకుంటున్నాను. న్యూజిలాండ్ కూడా ఇప్పటి వరకు పెద్దగా ప్రపంచ కప్‌లు గెలవలేదు. పైగా మాకంటే ఎక్కువసార్లు కివీస్ ఫైనల్స్ ఆడింది. ఫైనల్ వరకు వచ్చి ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. కాబట్టి న్యూజిలాండ్ జట్టుకు నేను సూచించేదేమిటంటే.. ఈ సారైనా మీరు ప్రపంచ కప్ గెలవండి.. ఒకవేళ మీరు ఈసారి కూడా ఓటమిపాలైతే మా ‘చోకర్స్’ ట్యాగ్‌ను అధికారికంగా మీకు ఇచ్చేస్తా. ఇక నుంచి ఆ ట్యాగ్ మీదే అవుతుంది. నాకు న్యూజిలాండ్ జట్టు అంటే ఇష్టమే. కానీ వారు భారత్‌ను ఓడించలేరు. భారత్ ఓడిపోవాలంటే వాళ్లు అన్ని విభాగాల్లోనూ దారుణంగా విఫలమవ్వాలి. అయితే టీమిండియాను న్యూజిలాండ్ ఓడిస్తుందా? అనే ప్రశ్న ఎదురైతే లేదు అనే చెబుతాను’ అని డేల్ స్టెయిన్ కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: అచ్చిరాని అహ్మదాబాద్‌లో.. గొప్ప రికార్డే లేని కివీస్‌పై! టీమిండియా కప్పు కొడుతుందా?

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మ్యాచ్‌కు ముందు టీమిండియా హోటల్ మార్పు!

Updated Date - Mar 07 , 2026 | 04:06 PM