Share News

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మ్యాచ్‌కు ముందు టీమిండియా హోటల్ మార్పు!

ABN , Publish Date - Mar 07 , 2026 | 02:20 PM

టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మ్యాచ్‌కు ముందు టీమిండియా హోటల్ మార్పు!
T20 World Cup 2026

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 కీలక పోరుకు సిద్ధమైంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్-భారత్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదే టీమిండియా బస చేసే హోటల్‌ను బీసీసీఐ చివరి నిమిషంలో మార్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఉన్నట్టుండి హోటల్ మార్పునకు గల స్పష్టమైన కారణాలు కూడా లేవు.


అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలు, విమానాలు

టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించాలనుకునే అభిమానుల కోసం పశ్చిమ రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కు ప్రత్యేక రైలును నడపనుంది. ఇప్పటికే అహ్మదాబాద్‌కు విమాన టికెట్ల ధరలు పెరిగిన నేపథ్యంలో పశ్చిమ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులకు కాస్త ఊరటినిచ్చింది. మరోవైపు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దేశంలోని పలు నగరాల నుంచి అహ్మదాబాద్‌కు విమాన టికెట్లకు డిమాండ్ పెరగడంతో విమానయాన సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. టీమిండియాకు మద్దతుగా వేల సంఖ్యలో అభిమానులు నరేంద్ర మోదీ స్టేడియానికి చేరుకోనున్నారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం

ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత్ 198 పరుగులకు ఆలౌట్

Updated Date - Mar 07 , 2026 | 03:36 PM