ఆసీస్‌తో ఏకైక టెస్టు: తొలి రోజు ముగిసిన ఆట.. 102 పరుగుల ఆధిక్యంలో భారత్
ABN , Publish Date - Mar 06 , 2026 | 06:49 PM
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 198 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా ఛేదనకు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు తలపడుతున్నాయి. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు 198 పరుగులకు ఆలౌటయ్యారు. కాగా ఛేదనకు దిగిన ఆసీస్.. తొలి రోజు ఆట ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 96 పరుగులు చేసింది. ఇంకా ఆసీస్‌పై భారత్ 102 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో ఆసీస్ బ్యాటర్ ఎలీస్ పెర్రీ(43*) హాఫ్ సెంచరీకి చేరువలో ఉంది. మరో ఎండ్‌లో అన్నాబెల్ సదర్లాండ్(20*) కొనసాగుతుంది.
స్పల్ప లక్ష్యంతో ఛేదనకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. జార్జియా వాల్(2), ఫోబ్ లిచ్‌ఫీల్డ్(9) స్పల్ప వ్యవధిలోనే పెవిలియన్ చేరారు. కెప్టెన్ అలీసా హీలీ(13) కూడా నిరాశపర్చింది. భారత బౌలర్లలో డెబ్యూ మ్యాచ్ ఆడుతోన్న సయాలీ సత్ఘరే 2, క్రాంతి గౌడ్ 1 వికెట్ పడగొట్టారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 62.4 ఓవర్లలో 198 పరుగులకు కుప్పకూలింది. స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్(52) హాఫ్ సెంచరీ చేసింది. జెమీమా మినహా ఇతర బ్యాటర్లు ఎవ్వరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. భారత బ్యాటర్లలో షఫాలీ వర్మ(35), కాష్వీ గౌతమ్(34) పర్వాలేదనిపించారు. స్మృతి మంధాన(4), ప్రతీకా రావల్(18), హర్మన్ ప్రీత్ కౌర్(19), దీప్తి శర్మ(7), రిచా ఘోష్(11), స్నేహ్ రాణా(5), సయాలీ సత్ఘరే(7) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో సదర్లాండ్ 4, హామిల్టన్ 3, బ్రౌన్ 2, ఆష్లీ గార్డ్‌నర్ 1 వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం
ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత్ 198 పరుగులకు ఆలౌట్