Share News

కొన్నిసార్లు పెద్ద ప్లేయర్లకు కష్టాలు తప్పవు: కపిల్ దేవ్

ABN , Publish Date - Mar 06 , 2026 | 08:05 PM

ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.

కొన్నిసార్లు పెద్ద ప్లేయర్లకు కష్టాలు తప్పవు: కపిల్ దేవ్
Kapil Dev

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ముగింపు దశకు చేరుకుంది. న్యూజిలాండ్, భారత జట్లు ఫైనల్‌కు అర్హత సాధించాయి. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇరుజట్లు తుదిపోరులో తలపడనున్నాయి. కాగా గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో టీమిండియా 7 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సంజు శాంసన్, బుమ్రా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. కాగా అభిషేక్ శర్మ(9) మరోసారి నిరాశపరిచాడు. ఈ ముగ్గురిపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ మాట్లాడాడు.


‘బుమ్రా ప్రపంచంలోనే టాప్ బౌలర్ అని భావిస్తున్నా. అతడి గురించి ఎంత చెప్పినా సరిపోదు. తీవ్ర ఒత్తిడిలోనూ ఎలాంటి ప్రదర్శన ఇచ్చాడో మనం చూశాం. దేశంలోని ప్రతి క్రికెట్ అభిమాని ప్రేమ, గౌరవానికి అతడు అర్హుడు. ఇక సంజు శాంసన్.. ఓ బ్రిలియంట్ క్రికెటర్. కొన్నిసార్లు పెద్ద ప్లేయర్లకూ కష్టాలు తప్పవు. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలి. ఆ పరిస్థితులను అనుభవించిన సంజు శాంసన్ తన ఫామ్‌ను అందుకున్నాడు. వెస్టిండీస్‌పై 97*, ఇంగ్లండ్‌పై 89 పరుగులతో అద్భుతం చేశాడు.


అభిషేక్ శర్మ ఇప్పుడు ఇలాంటి స్థితిలోనే ఉన్నాడు. అతడి స్ఫూర్తితో అభిషేక్ ఫైనల్ మ్యాచ్‌లో తప్పకుండా రాణిస్తాడని అనుకుంటున్నా. ఇది టీమ్ గేమ్. వ్యక్తిగత ప్రదర్శన కూడా ముఖ్యమే కానీ.. జట్టుగా విజయాలు సాధించడం అంతకంటే ముఖ్యం. ఇప్పుడు టీమిండియా ఇదే చేస్తోంది. ఫైనల్‌లోనూ గెలిచి విజేతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా’ అని కపిల్ దేవ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: చివరి స్థానం నుంచి అగ్రస్థానం వరకు.. భారత్ క్యాచ్ ఎఫిషియెన్సీ 100శాతం

ఆసీస్‌తో ఏకైక టెస్టు: భారత్ 198 పరుగులకు ఆలౌట్

Updated Date - Mar 06 , 2026 | 08:05 PM