Share News

టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్

ABN , Publish Date - Mar 07 , 2026 | 05:21 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆదివారం న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరగనుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడాడు. టీమిండియాతో మ్యాచ్ తమకు సవాలుతో కూడుకున్నది వెల్లడించాడు.

టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
Mitchell Santner

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026 ఫైనల్ ఆదివారం న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరగనుంది. దీనికి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. సెమీ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కివీస్‌ను.. కాస్త తడబడుతూ ఫైనల్‌కు చేరుకున్నా టీమిండియా ఢీకొట్టనుంది. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ మాట్లాడాడు. టీమిండియాతో మ్యాచ్ తమకు సవాలుతో కూడుకున్నది వెల్లడించాడు.


‘టీమిండియాలో స్టార్ పేసర్ బుమ్రా నుంచి ముప్పు పొంచి ఉందని ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అతడి ప్రదర్శన కూడా ఈ ప్రపంచ కప్‌లో అలాగే ఉంది. ఇంగ్లండ్ బ్యాటర్లు కూడా బుమ్రాను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డారు. ఆ మ్యాచ్‌లో అతడే గేమ్ ఛేంజర్. తప్పకుండా మాకు సవాల్ తప్పదు. కానీ కేవలం బుమ్రాతోనే కాదు.. భారత జట్టులోని ప్రతి ఒక్క ప్లేయర్‌తోనూ మేం జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాటింగ్ లేదా బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ వారు ఈ దశ వరకు చేరుకున్నారు. ఒక్కొక్కసారి ఒక్కో ప్లేయర్ ముందుకు వచ్చి జట్టును విజయ పథం వైపు నడిపించారు’ అని శాంట్నర్ పేర్కొన్నాడు.


పిచ్ విషయానికొస్తే..

‘ఇప్పటి వరకు నేను అహ్మదాబాద్ పిచ్‌ను పరిశీలించలేదు. ఇంకా పిచ్ కవర్ల కిందే ఉంది. అయితే ఈసారి భారీ స్కోర్లు నమోదు అయ్యే అవకాశం ఉందని మాత్రం అంచనా వేస్తున్నాం. పిచ్ ఫ్లాట్‌గా ఉంటుందని భావిస్తున్నా’ అని శాంట్నర్ తెలిపాడు.


ఇవి కూడా చదవండి:

టీ20 ప్రపంచ కప్: అచ్చిరాని అహ్మదాబాద్‌లో.. గొప్ప రికార్డే లేని కివీస్‌పై! టీమిండియా కప్పు కొడుతుందా?

టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మ్యాచ్‌కు ముందు టీమిండియా హోటల్ మార్పు!

Updated Date - Mar 07 , 2026 | 05:21 PM