భారత్‌తో ఏకైక టెస్టు: చెలరేగిన సయాలీ.. ఆసీస్ 323 పరుగులకు ఆలౌట్
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:24 PM
పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్ నైట్ 96/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 323 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాపై 125 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మహిళా జట్లు ఏకైక టెస్టులో తలపడుతున్నాయి. ఓవర్ నైట్ 96/3తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్.. 323 పరుగులకు ఆలౌటైంది. టీమిండియాపై 125 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అన్నాబెల్ సదర్లాండ్(129) శతకంతో అదరగొట్టింది. ఎలీస్ పెర్రీ(76) హాఫ్ సెంచరీ సాధించింది. భారత బౌలర్ సయాలీ సత్ఘరే అరంగేట్రంలో ఔరా అనిపించింది. ఏకంగా 4 వికెట్లు తీసి ఆసీస్‌ను కాస్త కట్టడి చేయగలిగింది. తొలి సెషన్‌లో భారత్ 198 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
తొలి సెషన్‌లో ఆసీస్ బ్యాటర్లు సదర్లాండ్, పెర్రీ మినహా ఇతర ప్లేయర్లు ఎవ్వరూ రాణించలేకపోయారు. జార్జియా వాల్(2), ఫోబ్ లిచ్‌ఫీల్డ్(9), అలీసా హీలీ(13), బెత్ మూనీ(19), ఆష్లీ గార్డ్‌నర్(1), మెక్ గ్రాత్(13), అలానా కింగ్(21), లూసీ హమిల్టన్(23) స్వల్ప పరుగులకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో సయాలీ 4, క్రాంతి గౌడ్ 2, దీప్తి శర్మ 2, స్నేహ్ రాణా, షెఫాలీ వర్మ తలొక వికెట్ పడగొట్టారు.
ఇవి కూడా చదవండి:
టీ20 ప్రపంచ కప్: అచ్చిరాని అహ్మదాబాద్‌లో.. గొప్ప రికార్డే లేని కివీస్‌పై! టీమిండియా కప్పు కొడుతుందా?
టీ20 ప్రపంచ కప్ ఫైనల్: మ్యాచ్‌కు ముందు టీమిండియా హోటల్ మార్పు!