ఆసీస్‌తో ఏకైక టెస్ట్: రెండో రోజు ముగిసిన ఆట.. టీమిండియా స్కోర్ 105/6
ABN , Publish Date - Mar 07 , 2026 | 06:38 PM
పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా-భారత మహిళా జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు తీవ్రంగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: పెర్త్ వేదికగా పింక్ బాల్ టెస్టులో భాగంగా ఆస్ట్రేలియా-భారత మహిళా జట్లు తలపడుతున్నాయి. రెండో సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళలు తీవ్రంగా విఫలమయ్యారు. రెండో రోజు ఆట ముగిసే సరికి 6 వికెట్లు కోల్పోయి కేవలం 105 పరుగులు మాత్రమే చేశారు. ఆసీస్‌పై ఇంకా 20 పరుగుల వెనుకంజలో కొనసాగుతున్నారు. తొలి సెషన్‌లో ఆసీస్ 353 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో ప్రతీకా రావల్(43*), స్నేహ్ రాణా(14) ఉన్నారు.
రెండో సెషన్‌లో టీమిండియా బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. స్మృతి మంధాన(2), షెఫాలీ వర్మ(5), జెమీమా రోడ్రిగ్స్(14), హర్మన్ ప్రీత్ కౌర్(11), దీప్తి శర్మ(9), రిచా ఘోష్(0) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఆసీస్ బౌలర్లలో లూసి హమిల్టన్ 3, అన్నాబెల్ సదర్లాండ్ 2, బ్రౌన్ 1 వికెట్ పడగొట్టారు. తొలి సెషన్‌లో టీమిండియా 198 పరుగులకే పరిమితమైన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
ఈసారైనా గెలవండి.. లేదంటే ఆ చోకర్స్ ట్యాగ్ మీకిచ్చేస్తా: కివీస్‌కు డేల్ స్టెయిన్ వార్నింగ్