టీమిండియా కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా సుభదీప్ ఘోష్?
ABN , Publish Date - Jul 28 , 2026 | 09:29 PM
టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఒప్పందాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడి స్థానంలో అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో మరో కీలక మార్పు చోటు చేసుకోనుంది. ఫీల్డింగ్ కోచ్ టీ.దిలీప్ ఒప్పందాన్ని పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది. దీంతో అతడి స్థానంలో అస్సాంకు చెందిన మాజీ క్రికెటర్ సుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు రంగం సిద్ధమైంది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని సపోర్ట్ స్టాఫ్‌లో ఘోష్ చేరనున్నట్లు సమాచారం. ఇటీవల టీమిండియా ఫీల్డింగ్‌లో వరుస తప్పిదాలు, క్యాచ్‌లు వదిలేయడం, గ్రౌండ్ ఫీల్డింగ్‌లో పొరపాట్లు ఎక్కువ కావడంతో బీసీసీఐ సాంకేతికంగా మరింత నైపుణ్యం కలిగిన కోచ్‌ను తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా ఫీల్డింగ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొనడంతో ఈ మార్పు అనివార్యమైంది.
'జాయ్'గా క్రికెట్ వర్గాల్లో పేరుగాంచిన 57 ఏళ్ల సుభదీప్ ఘోష్ అస్సాంలోని దిగ్‌బోయ్‌కు చెందిన క్రికెటర్. 1995 నుంచి 2005 వరకు అస్సాం, రైల్వేస్ జట్ల తరఫున ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఏ క్రికెట్ ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన ఆయన, అనంతరం కోచింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ఏడేళ్లుగా బీసీసీఐ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఘోష్.. 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలిచిన సీజన్‌లో కోచింగ్ బృందంలో పనిచేశారు. అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించారు.
2021లో భారత మహిళల జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా వ్యవహరించిన ఘోష్.. ఇండియా-ఏ, అండర్-19 జట్లతో కూడా విస్తృతంగా పనిచేశారు. కఠినమైన ఫీల్డింగ్ డ్రిల్స్, వేగవంతమైన రియాక్షన్ శిక్షణ, గ్రౌండ్ ఫీల్డింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టే కోచ్‌గా ఆయనకు మంచి పేరు ఉంది. రానున్న అంతర్జాతీయ సిరీస్‌లకు ముందు టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలను మెరుగుపరచడమే ఆయన ముందున్న ప్రధాన బాధ్యతగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కామన్వెల్త్ గేమ్స్: సెమీస్‌కు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్
భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ రాజీనామా.. ఐపీఎల్‌లో చేరేందుకు సిద్ధం!